ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా జిల్లాలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 4: కృష్ణా జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుఝాము నుండి మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి జన జీవనం స్తంభించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి ప్రజలు భీతిల్లారు. తీవ్రమైన ఈదురుగాలులు వీయటంతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాఫిక్, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ కృష్ణాలో చిరుజల్లులు పడగా తూర్పు కృష్ణా ప్రాంతంలో ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. జిల్లాలో సరాసరి వర్షపాతం 37.5 మి.మీలుగా నమోదైంది. అత్యధికంగా పామర్రులో 125.2 మి.మీలు, అత్యల్పంగా వీరుళ్ళపాడులో 1.6 మి.మీల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రం మచిలీపట్నం, దివిసీమ, పెడన, పామర్రు, మొవ్వ, గుడ్లవల్లేరులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాలేకపోయారు. మచిలీపట్నం పూర్తిగా జలమయమైంది. ప్రధాన రహదార్లలో మోకాలు లోతు నీళ్లు నిలవటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. బందరు బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు ఈదాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రధాన కూడలి కోనేరు సెంటరు సముద్రాన్ని తలపించింది.