ఆంధ్రప్రదేశ్‌

నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతిపక్షం పాత్ర జీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 4: విభజన తర్వాత జరిగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు తెలిసికూడా ప్రతిపక్షం తన పాత్రను సక్రమంగా నిర్వర్తించలేకపోయిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఐదుకోట్ల ప్రజలు సిఎం పిలుపుతో మూడోరోజున నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న నేపథ్యంలో ఇటువంటి సంకల్పాన్ని శతవిధాలుగా విఫలం చేసేందుకు జగన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుతోవపట్టిస్తున్నారంటూ ఆరోపించారు. శనివారం ఇక్కడ నవనిర్మాణ దీక్ష మూడోరోజు కార్యక్రమంలో ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీతతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఆర్థిక ఉన్మాదంటూ విమర్శించారు. భావితరాలకు ప్రజల ఆకాంక్ష మేరకు వారికి నవ్యాంధ్రప్రదేశ్ అందించాలన్న తపన ప్రస్తుత పాలకుమైన టిడిపికి అవకాశం ఉండొచ్చని, భవిష్యత్తులో ప్రతిపక్షమే అధికారపక్షమైతే ఆ ఫలాలు వారే అందిపుచ్చుకుంటారన్న కనీస ఆలోచనా విధానంతోనైనా ప్రతిపక్షనేత జగన్ వ్యవహరించలేకపోయారని అచ్చెన్న పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్ష పట్ల ప్రతిపక్షనేతగా వ్యతిరేకించాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. ఎపీ ప్రజల కోసం చేసే కార్యక్రమంలో అధికారపక్షం ఏమైనా తప్పిదాలు చేస్తే సూచనలు, సలహాలు ఇచ్చేలా ప్రతిపక్షం ఉండాలే తప్ప చెప్పులతో కొట్టమంటూ, రాళ్ళతో బాదమంటూ ఉచిత సలహాలు ఇస్తే ఆంధ్రాలో ఐదుకోట్లమంది ప్రజలు జగన్‌ను తరమికొడతారన్నారు. జగన్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బాబుకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలోప్రజలే మరోసారి బుద్ధి చెబుతారన్నారు. ముఖ్యమంత్రిని జగన్ చెప్పుతో కొట్టండి అని చెప్పడం హేయమైన చర్యగా భావించి తన మాటను వెనక్కు తీసుకొని రాప్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని టిడిపి రాష్ట్ర అద్యక్షుడు కిమిడి కళా వెంకటరావు డిమాండ్ చేసారు. శనివారం ఇక్కడి పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇష్టం ఉన్నా, లేకున్నా పాటించాల్సిన నియమ నిబంధనలు కొన్ని ఉంటాయన్నారు. అయితే వాటిని పాటించడంలో జగన్ పూర్తిగా వైఫల్యం చెందారని, సభలో సైతం ఇదే తీరుతో ప్రతిపక్ష నేతగా, ఎన్నికల ముందు పార్టీని ముందుకు నడిపించలేక వైఫల్యం చెందిన ఆయన మానసిక స్థితిపై కుటుంబ సభ్యులు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.