ఆంధ్రప్రదేశ్‌

జగన్‌పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 4: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్మోహన రెడ్డిపై టిడిపి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి పలువురు ఎమ్మెల్యేలు జగన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే వంగలపూడి అనిత, యలమంచిలి పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ పప్పల చలపతి రావు జగన్ తీరుపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే విశాఖ నగర పరిధిలోని పెదగంట్యాడ పోలీసు స్టేషన్ పరిధిలో పులి రమణారెడ్డి జగన్‌కు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా సాలూరులో మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజదేవ్, బొబ్బిలిలో బేబీ నాయన, విజయనగరం పట్టణంలో ఎమ్మెల్యే మీసాల గీత జగన్‌పై చర్యలు కోరుతూ ఫిర్యాదు చేశారు. ఇక జగన్ తీరును నిరసిస్తూ విశాఖ నగరంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరులు జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయగా, చంద్రబాబు వైఖరిపై వైకాపా నేత కోలా గురువులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.