ఆంధ్రప్రదేశ్‌

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మించనున్న అంతర్జాతీయ విమనాశ్రయానికి అవరోధాలు తొలిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ, హడ్కో, స్పెషల్‌పర్పస్ వెహికల్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కంపెనీ ఉమ్మడిగా ఎంఓయూను ఖరారు చేశాయి. దీని వల్ల హడ్కో ఈ విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం రూ. 650 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తుంది. మొదటి దశలో 2400 ఎకరాల భూమిని సేకరించేందుకు ఈ నిధులను ఖర్చుపెట్టనున్నారు. వచ్చే 15 రోజుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సంస్థకు ఈ నిధులను మంజూరు చేస్తారు. విజయనగరం జిల్లా కలెక్టర్ వద్ద ఈ నిధులను డిపాజిట్ చేస్తారు. ఈ విమానాశ్రయానికి 13,000 ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. కాగా స్థానిక రైతులు ఈ ప్రతిపాదనకు వ్యతిరేకించారు. భూసేకరణ చట్టం కింద నిర్దేశించిన నిబంధనల కంటే ఎక్కువ నష్టపరిహారాన్ని రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. వచ్చే ఆరునెలల్లో మొదటి దశలో భూసేకరణ పనులు పూర్తవుతాయి. దీనికి సంబంధించి రుణాన్ని వచ్చే 17 సంవత్సరాల్లో భోగాపురం ఇంటర్నేషనల్ సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. భూసేకరణ జరిగిన వెంటనే అంతర్జాతీయంగా విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లను పిలుస్తారు. ఎయిర్‌బస్ 380 ల్యాండ్ అయ్యేందుకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దనున్నారు.