ఆంధ్రప్రదేశ్‌

ఫిరాయంపు నేతలకు పదవులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 2 : తెలుగుదేశం పార్టీని భుజాల మీద పెట్టుకుని మోస్తున్న బిసిలను చిన్న చూపు చూస్తున్నారు, పార్టీ మారిన వారికి, డబ్బులున్న వారికి పదవులు ఇస్తున్నారు ఇది మంచి సంప్రదాయం కాదని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి సోదరుడైన మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపి తరపున రాజ్యసభకు బిసిలను ఎంపిక చేయకపోవడంపై కెఇ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం కర్నూలులో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అలాగే నగరంలోని టిడిపి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కెఇ రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసిన తీరుపై విమర్శలు గుప్పించారు. పార్టీని నమ్ముకుని అధికారంలో ఉన్నా లేకపోయినా ఇబ్బందులుపడుతూ పార్టీని ముందుకు నడిపించామని గుర్తు చేశారు. పార్టీ కోసం తాము పడుతున్న శ్రమను ఏ మాత్రం గుర్తించకుండా పార్టీ మారిన వారికి, డబ్బులు ఖర్చు చేసిన వారిని ఎంపిక చేయడం సమంజసం కాదన్నారు. గత ఎన్నికల్లో తాను కర్నూలు ఎంపి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే తనకు రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించడం సరైన చర్య కాదని ఇది బిసిలకే అవమానమన్నారు. అయితే ధర్నా అనంతరం టిడిపి జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కార్యాలయం నుంచి బయటకు వచ్చి నామినేటెడ్ పదవుల భర్తీలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తామని హామీ ఇవ్వడంతో కెఇ ప్రభాకర్ శాంతించారు. ధర్నాలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ, బిసి సంఘాల నాయకులు శ్రీనివాసులు, శేషఫణి, రాంబాబు పాల్గొన్నారు.