ఆంధ్రప్రదేశ్‌

మంత్రి పుల్లారావుకు నాన్ బెయిలబుల్ వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 1: సమైక్యాంధ్ర ఉద్యమంలో రైల్‌రోకో నిర్వహించిన కేసులో రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు మరికొందరికి రైల్వేకోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్‌లు జారీచేసింది. 2014లో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను అఖిలపక్షం ఆధ్వర్యంలో అడ్డగించి ఆందోళన నిర్వహించారు. దీనిపై అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి పుల్లారావుతో పాటు తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎం జియావుద్దీన్, కాంగ్రెస్ట్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, వైసిపి నగర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తదితరులకు వారెంట్‌లు జారీఅయ్యాయి. గత మూడు విడతలుగా కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో రైల్వేకోర్టు స్పందించింది. కేసును తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.