ఆంధ్రప్రదేశ్‌

పద్యం పిడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 1: ఆంగ్ల భాష జోరందుకుంటున్న నేటి సమాజంలో తెలుగు నేర్చుకోవాలంటేనే తాము తక్కువ వారేమో అని భావిస్తున్న అనేకమంది కళ్లు తెరిపించేలా నాలుగేళ్ల వయసున్న వంద మంది చిన్నారులు 10 నిమిషాల్లో వంద వేమన పద్యాలను శ్రావ్యమైన కంఠంతో అలవోకగా వల్లిం చి అందరినీ విస్మయపరిచారు. ఏకకాలంలో మూడు రికార్డులను బద్దలు కొట్టారు. తిరుపతిలో మేక్ మై బేబీ జీనియస్ పాఠశాల విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఈ చిచ్చర పిడుగులు గతంలో జ్ఞాపక శక్తి ప్రదర్శనల్లో అనేక రికార్డులు సృష్టించారు. తిరుపతిలోని వరదరాజ నగర్‌లోని విశ్వం విద్యాసంస్థల ఆవరణలో బుధవారం జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ-ఆంధ్ర వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదుకోసం ఎంఎంబిజి విద్యార్థులకు పోటీ పెట్టారు. ఈ పోటీ లో చిన్నారులు ముక్తకంఠంతో పది నిమిషాల్లో 100 వేమన పద్యాలను వినిపించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన ఎమ్మె ల్యే సుగుణమ్మ, తిరుపతి సైన్స్ కో ఆర్డినేటర్ మణికండన్, విశ్వం విద్యాసంస్థల అధినేతలు విశ్వనాథరెడ్డి, తులసి విశ్వనాథరెడ్డి మంచి ధారణ శక్తిగల ఈ చిచ్చరపిడుగులను అభినందించారు. ఇప్పుడు వేమన పద్యాలు చెప్పిన విద్యార్థులంతా గతంలో నూరు సంవత్సరాల క్యాలెండర్‌ను, నూరు ఎక్కాలను, నూరు మంది కౌరవుల పేర్లను కూడా చెప్పారని అన్నారు. ఏడేళ్ల వయస్సున్న తమ విద్యార్థులు నూరు భగవద్గీత శ్లోకాలను, 118 మూలకాల ఆవర్తన పట్టికను ఎటునుంచి ఎటైనా చెప్పగలిగే సత్తా సాధించారన్నారు. విద్యార్థుల ప్రతిభను గమనించిన జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఏషియా హెడ్ బింగి నరేంద్ర, తెలంగాణ-ఆంధ్ర వంబర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కో ఆర్డినేటర్ పద్మశ్రీ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎపి చీఫ్ కోఆర్డినేటర్ సాయిశ్రీ తమ రికార్డుల్లో దీనికి చోటుకల్పిస్తున్నట్లు ప్రకటించి రికార్డులను అందజేశారు.