ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోంపేట/ యాడికి, మే 28: రాష్ట్రంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందార. అనంతపురం జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బేసిరామచంద్రాపురం జాతీయరహదారి కూడలి వద్ద శనివారం వేకువజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. సోంపేట సిఐ సూరినాయుడు కథనం మేరకు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం పంచాయతీ చింతలపేట గ్రామానికి చెందిన ఎ.రాము(31) మామిడికాయల లోడుతో బొలేరో వాహనంలో ఒడిశాకు చెందిన సంతోష్‌బెహరా(23)తో కలసి వెళ్లాడు. సంతోష్ బంధువు సుశాంత్‌బెహరా(20) కూడా వీరితో ఉన్నాడు. శనివారం వేకువజామున 2 గంటల సమీపంలో జాతీయ రహదారిపై ఆగి వున్న గ్రానైట్ లారీని బలంగా ఢీకొట్టడంతో వీరు వెళ్తున్న బొలెరో వాహనం నుజ్జునుజ్జు కావడంతో ఈ ముగ్గురూ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహన సిబ్బంది సమాచారాన్ని సమీప పోలీసులకు చేరవేశారు. వీఆర్వో జీవన్ సమాచారం మేరకు సోంపేట సిఐ సూరినాయుడు, బారువ ఎస్‌ఐ శ్రీనివాసరావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలను అతి కష్టమీద బయటకు తీసి 108 వాహనంలో సోంపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సెల్‌ఫోన్ల ఆధారంగా ఒడిశాలోని వారి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. మృతుల బంధువుల సమక్షంలో సోంపేట, బారువ పోలీసులు శవపంచానామా నిర్వహించి మృతదేహాలను వారికి అప్పగించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ఒకరి సమీప బంధువు గంగాబెహరా ఫిర్యాదు మేరకు సోంపేట సిఐ సమక్షంలో బారువ ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసారు.
యాడికిలో ఇద్దరు మృతి
యాడికి: అనంతపురం జిల్లా యాడికి మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ద్విచక్ర వాహనం సిమెంటు లారీని ఢీకొనడంతో గుడిపాడు గ్రామానికి చెందిన మద్దిలేటి రాముడు(40), రామచంద్రుడు(20) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.

చిత్రం ఆగి ఉన్న గ్రానైట్ లారీని ఢీకొట్టగా నుజ్జునుజ్జయిన బొలేరో