తెలంగాణ

తెలంగాణతో డ్రీమ్‌వర్క్స్ భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28:తెలంగాణతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ అయిన డ్రీమ్ వర్క్స్ తన వ్యాపార విస్తరణకు తెలంగాణను ఎంపిక చేసుకుంది. పెట్టుబడులను ఆకర్శించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తన ఐదవ రోజు పర్యటనలో లాస్ ఎంజెల్స్‌లో వివిధ సంస్థలను కలిశారు. డ్రీమ్ వర్క్స్ ప్రధాన కార్యాలయంలో సిఇఓ జెఫ్రీ కాట్జన్ బర్గ్‌ను కెటిఆర్ కలిశారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని , తెలంగాణలో ఉన్న అవకాశాలను కెటిఆర్ వివరించారు.
తమకు భారత్‌లో విస్తరించే ఆలోచనలు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తమ దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యాన్ని కోరుతున్నట్టు చెప్పారు. దీనితో పాటు తమ సినిమాల ప్రమోషన్ కోసం హై ఎండ్ ఎకో సిస్టమ్‌తో ఒక థియోటర్‌ను నిర్మిస్తామని దానికి సహకరించాలని జెఫ్రీ కోరారు. దీనికి స్పందించి కెటిఆర్ డ్రీమ్ వర్క్స్‌కు సహకరిస్తామని హామీ ఇచ్చారు. డ్రీమ్ వర్క్స్ విస్తరణకు అంతర్జాతీయ స్థాయిలో త్వరలో హైదరాబాద్‌లో నిర్మించే ఫిల్ట్ సిటీ అత్యంత అనుకూలంగా ఉంటుందని కెటిఆర్ తెలిపారు.
పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో చిన్న తరహా థీమ్ సెంటర్ , డ్రీమ్ ప్లేను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం , డ్రీమ్ వర్క్స్ ఉమ్మడి సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు అవగాహన కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చి భారత మార్కెట్ అవసరాలు, స్థానిక నైపుణ్యాన్ని పరిశీలించాలని జెఫ్రీని కెటిఆర్ కోరారు. హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ఆ తర్వాత లాస్ ఎంజెల్స్ ఇన్నోవేషన్ సెంటర్ ఐ- హబ్ ఇంక్యుబెటర్‌ను కెటిఆర్ సందర్శించారు. నీటి సంరక్షణతో పాటు మురుగునీటి శుద్ధిలో వినూత్నమైన పద్దతులను అవలంభిస్తున్న ఐ- హబ్ పనితీరు, విజయవంతమైన తీరును కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన టి-హబ్ గురించి కెటిఆర్ వారికి వివరించారు. టి-హబ్‌కు తగిన సహకారం అందించాలని, కలిసి పని చేయాలని తారక రామారావు కోరారు. ఇంక్యూబెటర్ సిఇఓను కెటిఆర్ హైదరాబాద్‌కు ఆహ్వానించారు.