ఆంధ్రప్రదేశ్‌

సవాళ్ళను సమర్థంగా ఎదుర్కోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 26: భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను పోలీసులు ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా గురువారం సాయంత్రం ఆయన పోలీస్ ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశమై, శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం, పోలీసులు మెతగ్గా ఉన్నారన్న అభిప్రాయం జనంలో వస్తే, అసాంఘిక శక్తులు విజృంభిస్తాయని అన్నారు. ఈ ఏడాది విశాఖలో ఐఎఫ్‌ఆర్, సిఐఐ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నామని అన్నారు. రానున్న కృష్ణా పుష్కరాలకు మళ్లీ సర్వశక్తులు కూడదీసుకుని సన్నద్ధం కావాలని ఆయన చెప్పారు. శ్రీశైలం దేవస్థానానికి ప్రత్యేంగా చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్టవేసేందుకు వెహికల్ స్కానర్స్, డ్రోన్ కెమేరాలను ఉపయోగించుకోవాలని పోలీసు అధికారులకు సిఎం ఆదేశాలు జారీ చేశారు. శ్రీసిటీకి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు.
వ్యవసాయ ప్రణాళిక విడుదల
ఇదిలా ఉండగా కలెక్టర్ల సదస్సు ముగింపు దశలో 2016-17 వ్యవసాయ ప్రణాళికను చంద్రబాబు విడుదల చేశారు. రసాయన ఎరువుల వాడకం మోతాదుకు మించి వాడకుండా జాగ్రత్తలు తీసుకోవలిన సిఎం అధికారులకు సూచించారు. గ్రామ స్థాయి నుంచి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను సిఎం ఆదేశించారు. చివరగా చంద్రబాబు మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో జట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చడానికి ప్రయత్నించాలని సిఎం కలెక్టర్లకు పిలుపునిచ్చారు.