ఆంధ్రప్రదేశ్‌

మంత్రి ప్రత్తిపాటి ఇల్లు ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, మే 21: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లైనా రుణాలు మాఫీ చేయక పోవడంతో తమ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయంటూ కౌలురైతులు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాసాన్ని శనివారం ముట్టడించారు. పారదర్శక పాలన అంటూ ప్రతిరోజూ ప్రసంగాలు చేస్తున్న ప్రజాప్రతినిధులు కౌలురైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతేడాది 139 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుని, 59 వేల కోట్ల పంట రుణాలు మంజూరు చేశారన్నారు. ఇందులో కేవలం 218 కోట్లు మాత్రమే రైతుల్లో 70 శాతంగా ఉన్న కౌలురైతులకు దక్కిందన్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కౌలురైతులు తరలివచ్చి ముందుగా ఎన్‌ఆర్‌టి సెంటర్ జాతీయ రహదారి గుండా ర్యాలీ నిర్వహించి, ప్రత్తిపాటి ఇంటికి చేరుకున్నారు. కౌలురైతుల రుణాలు తక్షణమే మాఫీ చేయాలంటూ ప్లకార్డులు చేతబూని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎపి కౌలురైతు సంఘం అధ్యక్షుడు నాగబోయిన రంగారావు మాట్లాడుతూ సాగుభూముల్లో 70 శాతం వరకు కౌలురైతులే సేద్యం చేస్తున్నారని, ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసని, అటువంటి రైతులకు రుణమాఫీ చేయకపోవడం కౌలురైతుల నడ్డి విరచడమేనని మండిపడ్డారు. 2011 కౌలురైతుల చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని, కౌలు రైతులందరికీ రుణమాఫీ చేయడంతో పాటు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు బ్యాంకుల నుండి పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పథకం, విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని ప్లకార్డులు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో కౌలురైతులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ తరుణంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాసంలో లేకపోవడంతో ఎపి కౌలురైతు సంఘం అధ్యక్షుడు రంగారావు ఫోన్‌లో మాట్లాడారు. రుణమాఫీ అమలు కాని కౌలురైతుల దరఖాస్తులను అందజేస్తే ముఖ్యమంత్రితో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని పుల్లారావు హామీ ఇచ్చారు. జూన్ మొదటి వారంలోపు కొత్తగా రుణాలు అందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు.

చిత్రం పోలీసులతో రైతుల వాగ్వివాదం