ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్భ్రావృద్ధి కోసం తరలి వస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 21 : హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉద్యోగులు తరలి రావడంలో అనేక సమస్యలు వున్నప్పటికీ రాష్ట్భ్రావృద్ధి కోసం తరలి వస్తున్నామని ఎపి ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు పి అశోక్‌బాబు అన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎన్జీవోస్ భవనం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల 11 సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తమ బృందం తీసుకువెళ్లిందని, అయితే ప్రతీ అంశంపైనా సానుకూలంగా ఆయన స్పందించి తగు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 4.40 లక్షల మంది ఉద్యోగులుండగా 20 వేల మందికి పిఆర్‌సి అమలు చేయాల్సి వుందని అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో అన్ని డిపార్ట్‌మెంట్లలోనూ పిఆర్‌సి అమలు చేసినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం దాదాపు 11 డిపార్ట్‌మెంట్లలో పి ఆర్‌సి అమలు చేయాల్సి వుందని అన్నారు. ఉద్యోగుల 60 సంవత్సరాల రిటైర్మ్‌ంట్ విషయంలో అన్ని శాఖలకు వర్తింపచేయాలని కోరామని చెప్పారు. ప్రభుత్వం వినియోగిస్తున్న ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉద్యోగులు కూడా వినియోగిస్తున్నారని చెప్పడానికి విఆర్వోలు, ఎంపి హెచ్‌ఏలు కూడా ట్యాబ్‌ల ద్వారా ఉన్నతాధికారులకు నివేదిక పంపించడమేనని అన్నారు. రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ఎన్ని కష్టాలు ఎదురైనా గానీ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తమ యూనియన్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. ఇ-ఫైల్స్ విధానం వలన కూడా పెండింగ్ లేకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తవుతాయని అన్నారు. ఇటీవల చంద్రబాబు తనతో మాట్లాడుతూ ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ సంస్థల పనితీరును అధికం చేయాలని సూచించారని, ఆ మేరకు తాము కూడా నిర్ణయం తీసుకుని చర్చించామని చెప్పారు. ప్రతీ ఉద్యోగి కూడా లక్ష్యాలను అధిగమించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తారని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చేయవద్దని తమ యూనియన్ పోరాటాలు చేసిందని అన్నారు. ప్రత్యేక హోదా విషయం ప్రస్తావించగా అది రాజకీయ వ్యవస్థ ద్వారా రావాలని, అవసరమైతే తాము కూడా పోరాటానికి సిద్ధంగానే వున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎన్‌జివో సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు ఎ విద్యాసాగర్, జిల్లా అధ్యక్షులు యోగానంద్, కార్యదర్శి ఆర్ ఎస్ హరినాధ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సతీష్, ఏలూరు తాలూకా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరావు, జెఎసి ఛైర్మన్ ఎల్‌వి సాగర్, కార్యదర్శి పి రమేష్, అసోసియేటెడ్ నాయకులు బి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తాలూకాల వారీగా ఉద్యోగులతో ఆయన సమావేశం నిర్వహించారు.