ఆంధ్రప్రదేశ్‌

మందుపాతరల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, మే 21: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మన్యంలో మావోయిస్టులు పోలీసు బలగాలే లక్ష్యంగా మందుపాతరలను అమర్చుతూ కలకలం సృష్టిస్తున్నారు. గత 13వ తేదీన ఏడుగుర్రాలపల్లి గ్రామ సమీపంలోని రేగులపాడు గుంపులో మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. మళ్లీ శనివారం ఏడుగుర్రాలపల్లి సంత సమీపంలోని మామిడిచెట్టు కింద మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను పోలీసులు గుర్తించారు. ఒఎస్‌డి ఫకీరప్ప పర్యవేక్షణలో కాకినాడకు చెందిన బాంబు స్క్వాడ్ గోపి ఆధ్వర్యంలో మందుపాతరలను శనివారం నిర్వీర్యం చేశారు. చింతూరు పోలీస్ స్టేషన్లో విలేఖరులతో ఒఎస్‌డి ఫకీరప్ప మాట్లాడారు. మావోయిస్టులు మందుపాతరలతో విధ్వంసాలు సృష్టించి, తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతరలను ప్రజలు తొక్కి ప్రాణాలను కోల్పోతే వారి ప్రాణాలను తిరిగి ఇస్తారా అని మావోయిస్టులను ఆయన ప్రశ్నించారు. దండకారణ్య సరిహద్దు పోలీస్ స్టేషన్లను హై అలర్టు చేసినట్టు తెలిపారు. అలాగే దండకారణ్యంలో పోలీస్ బలగాలతో విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నట్టు తెలిపారు. విలీన మండలాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు పోలీసులు చెక్‌పెట్టినట్టు పేర్కొన్నారు. ఎఎస్పీ నరుూం హస్మి, డిఎస్పీ మురళీమోహన్, చింతూరు సిఐ దుర్గారావు, ఎస్‌ఐ గజేంద్రకుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం మందుపాతర సామాగ్రిని చూపిస్తున్న ఒఎస్‌డి ఫకీరప్ప