ఆంధ్రప్రదేశ్‌

కుల వివాదంపై విచారణకు హాజరైన అరకు ఎంపి కొత్తపల్లి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 21: కుల వివాదంలో ఇరుక్కున్న అరకు ఎంపి కొత్తపల్లి గీత శనివారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి స్క్రూట్నీ కమిటీ నిర్వహించిన విచారణకు హాజరయ్యారు. ఈమె ఎస్టీ (గిరిజన కులం) కాదంటూ న్యాయస్థానంలో ప్రత్యర్ధులు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ అంశంపై విచారణకు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ అధ్యక్షతన స్క్రూట్నీ కమిటీ సమావేశం అయ్యింది. సమావేశానికి హాజరైన తన తరఫు న్యాయవాది చెట్టూరి శ్రీనివాసరావుతో సహా హాజరైన గీత సుమారు గంట పాటు కుల నిర్ధారణ విషయంలో వచ్చిన అభియోగాలపై వివరణ ఇచ్చారు. అనంతరం ఆమె కలెక్టరేట్ ప్రాంగణంలో విలేఖరులతో మాట్లాడారు. తాను ఎస్టీ కాదంటూ దాఖలైన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు వచ్చానని, ఇందుకు గడువు కోరినట్టు చెప్పారు. తాను ఎస్టీ (వాల్మీకి కులం)కి చెందినట్టు నిర్ధారించే అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు తనవద్ద ఉన్నట్టు ఆమె తెలిపారు.

చిత్రం జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీ వద్ద విచారణకు హాజరైన ఎంపి గీత