తెలంగాణ

నడి వయసులో ఎంసెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: తెలంగాణలో ఎంసెట్ పరీక్ష రాస్తున్న వారిలో కొంత మంది అనుమానితులను నిర్వాహకులు గుర్తించారు. అయితే పరీక్ష రాస్తున్న అనుమానితుల లక్ష్యం ఏమిటో, ఎందుకు రాస్తున్నారో, వారేం చేయబోతున్నారో తాము పోలీసులకు సమాచారం ఇచ్చి వివరాలు సేకరిస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ వి రమణారావు చెప్పారు. సహజంగా ఇంజనీరింగ్ లేదా మెడికల్ ప్రవేశపరీక్షలు 17 ఏళ్ల నుండి 20 ఏళ్ల ప్రాయం ఉన్న వారు రాస్తుంటారని, అంతకంటే మించి వయస్సున్న వారు పరీక్ష రాస్తున్నారంటే అనుమానించాల్సి వస్తుందని, అయితే ఈసారి ఏకంగా 48 ఏళ్లు వయస్సున్న వారు సైతం దరఖాస్తు చేయడంతో వారి సమాచారాన్ని పోలీసులకు పంపించామని చెప్పారు.
1968లో పుట్టిన వారు ఒకరు ఇంజనీరింగ్‌కు, మరొకరు మెడికల్ ఎంట్రన్స్‌కు దరఖాస్తు చేశారు. వారి ప్రస్తుత వయస్సు 48 ఏళ్లు దాటాయి. అలాగే 1981లో పుట్టి 35 ఏళ్ల ప్రాయం ఉన్న 34 మంది దరఖాస్తు చేశారు. 34 ఏళ్ల ప్రాయం ఉన్న వారు 19 మంది, 33 ఏళ్లున్న వారు 15 మంది, 32 ఏళ్లున్న వారు 28 మంది, 31 ఏళ్లున్నవారు 21 మంది, 30 ఏళ్లున్న వారు 34 మంది దరఖాస్తు చేశారు.
29 ఏళ్లున్న వారు 41 మంది, 28 ఏళ్లవారు 74 మంది, 27 ఏళ్లవారు 91 మంది, 26 ఏళ్ల వారు 115, 25 ఏళ్ల వారు 108, 24 ఏళ్ల వారు 202, 23 ఏళ్ల వారు 362 మంది, 22 ఏళ్ల వారు 793 మంది దరఖాస్తు చేశారు. 21 ఏళ్ల వారు 2300 , 20 ఏళ్ల వారు 8202 మంది, 19 ఏళ్ల వారు 33087 మంది దరఖాస్తు చేశారు. మిగిలిన వారంతా 19 ఏళ్ల లోపు వారే. అయితే విచిత్రం ఏమంటే ఇందులో 112 మంది 10వేల రూపాయల జరిమానాతో కూడా ఫీజు కట్టారు. 2000లో పరీక్ష పాసైన ఒక అభ్యర్ధి ఇంజనీరింగ్‌కు 10వేల రూపాయల జరిమానాతో ఫీజు కట్టడం అనుమానాలకు తావిస్తోంది. 5వేల జరిమానాతో 175 మంది ఫీజు చెల్లించగా, వెయ్యి రూపాయల జరిమానాతో 1585 మంది దరఖాస్తుచేశారు. అయితే వెయ్యి రూపాయల జరిమానాతో 2001లో ఇంటర్ పాసైన అభ్యర్ధులు ఇద్దరు ఫీజులు కట్టారు. వారి సంగతిపైనా అధికారులు నిఘా పెట్టారు. వీరందరిపైనా పరీక్ష కేంద్రంలోనూ నిఘా ఉంటుందని పేర్కొన్నారు.