ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం హస్తినలో మరో పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 5: ప్రత్యేక హోదా సాధనకు అవసరమైతే ఢిల్లీలో మరో పోరాటం నిర్వహించేందుకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు సిపిఐ, ప్రత్యేకహోదా సాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపికి తీరని అన్యాయం చేశారని, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఏపికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని నాడు పార్లమెంటులో పట్టుపట్టిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేడు నోరు మెదపకపోవటం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. వెంకయ్యనాయుడు ఇకనైనా స్పందించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా ఏపి నుంచి రాజ్యసభ సభ్యునిగా ఏ ముఖం పెట్టుకుని ఎన్నికవుతారని ప్రశ్నించారు. ఇది ఏపి ప్రజలను వంచించటమే అన్నారు. ప్రత్యేక హోదా సాధించలేకపోతే వెంకయ్యతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు.