ఆంధ్రప్రదేశ్‌

అమ్మో.. అమరావతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 5: రాజధాని అమరావతిలో రైతులు తెలివిమీరిపోయారు. ఓపక్క రాజధానికి భూములు ఇచ్చినట్టే ఇచ్చి, వాటిని అమ్ముకొని చాలా మంది రైతులు సొమ్ము చేసుకున్నారు. మరికొంతమంది ఉన్న పొలంలోనే ఐదంతస్థుల భవనాలను నిర్మించి, ఇక్కడికి వచ్చే ఉద్యోగులకు అద్దెకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. జూన్‌లో ఎలాగూ రాజధానికి వెళ్లక తప్పదని భావించిన సెక్రటేరియట్ ఉద్యోగులు ఇక్కడికి వచ్చి ఇళ్ళు చూసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెండు నెలల నుంచి ఉద్యోగులు సెక్రటేరియట్‌కు దగ్గరలో ఇళ్ళు తీసుకోవాలని భావించి కొన్ని ఇళ్ళను చూసుకున్నారు. ఆరోజు ఒక్కో ఫ్లాట్ అద్దె తొమ్మిది నుంచి 10 వేల రూపాయలు చెప్పారు. ఆరోజు అడ్వాన్స్ ఇస్తామంటే ఇళ్ల యజమానులు తీసుకోలేదు. గత వారం కొంతమంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చి ఇళ్ళ కోసం ప్రయత్నించగా ఆ అద్దెను 15 వేలకు పెంచేశారు. ఉద్యోగులకు అదనంగా డిఎ ఇస్తామని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు. అయితే, అది అదనపు డిఎ కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తేల్చి చెప్పడంతో ఉద్యోగులు ఆశ్ఛర్యపోయారు. వెరికి అదనపు డిఎ వస్తుందని తెలుసుకున్న రాజధాని ఇళ్ళ యజమానులు ఇంటి అద్దెలను భారీగా పెంచేశారు.
ఇప్పటికే విద్యార్థుల స్థానికతపై ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. దీనిపై రాష్టప్రతి నిర్ణయం తీసుకోవలసి ఉంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం చెపుతోంది. దాని సంగతి పక్కన పెడితే, రాజధానికి వచ్చే ఉద్యోగుల పిల్లలకు విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఏ స్కూల్లోను, కళాశాలల్లోనూ సీట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లినా సీట్లు అయిపోయాయని చెపుతున్నారు.