ఆంధ్రప్రదేశ్‌

విశాఖ పరిశ్రమల్లో ప్రమాదాలపై కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 29: పారిశ్రామిక నగరం విశాఖలోని పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. పరిశ్రమల్లో పాటిస్తున్న భద్రతాప్రమాణాలు, ఇతర అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌కు ఆదేశాలందాయి. ఈ మేరకు కలెక్టర్ యువరాజ్ ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి, నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. ఈనెల 26న దువ్వాడ సెజ్‌లోని బయోమ్యాక్స్ బయోడీజిల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో మంటలను చల్లార్చేందుకు జిల్లా యంత్రాంగం అష్టకష్టాలు పడింది. మూడురోజుల పాటు శ్రమించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదంలో అంటుకున్న 12 స్టోరేజ్ ట్యాంకుల్లో నిల్వ ఉంచిన ఇంధనం మొత్తం కాలిన తర్వాతే మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాద ఘటనపై ప్రాధమిక నివేదికను సిఎం చంద్రబాబుకు కలెక్టర్ అందజేశారు. భారీ అగ్నిప్రమాదంలో ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ముఖ్యంగా ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన ఇంధనం ట్యాంకుల మధ్య దూరం ఎక్కువగా లేకపోవడం వల్లే ప్రమాదంలో 12 ట్యాంకులు దగ్ధమైనట్లు నిర్ధారించారు. వీటితో పాటు భద్రతాపరమైన చర్యలకు యాజమాన్యం ప్రాధాన్యత ఇవ్వలేదని తేల్చారు. బయోమ్యాక్స్ ప్రమాదంతో లోపాలు గుర్తించిన అధికారులు విశాఖలో ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని హెటిరో ఫార్మాకంపెనీలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.