ఆంధ్రప్రదేశ్‌

కారిడార్‌కు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 26: విశాఖ-చెన్నై కారిడార్ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ఆర్థిక ఆసరా లభించింది. ఈ పారిశ్రామిక కారిడార్ కోసం 3,500 కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడిబి) ముందుకు వచ్చింది. విజయవాడ సిఎంఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏడిబి ప్రతినిధులు మంగళవారం కలిశారు. విశాఖ-చెన్నై కారిడార్‌ను త్వరితగతిన పూర్తి చేయడానికి ఏడిబి బృందం హామీ ఇచ్చింది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఏడిబి ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కోరగా, అందుకు ఆయన అంగీకరించారు. ఇప్పటివరకూ రుణ సాయంపై దశలవారీగా తాము తీసుకున్న చర్యల గురించి ఈ బృందం సిఎంకు వివరించింది. ప్రభుత్వం నుంచి తమకు పూర్తిగా సహకారం లభించడంపై ఏడిబి కంట్రీ డైరక్టర్ టెరెస్సాఖో సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏడిబి అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని టెరెస్సాఖో సిఎం చంద్రబాబును కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశం ఉన్నందువలన వివిధ రంగాలను ఎకనమిక్ డవలప్‌మెంట్ బోర్డు గుర్తించి ప్రాజెక్ట్ రిపోర్టులను రూపొందిస్తోందని చంద్రబాబు చెప్పారు. దీనిపై ఏడిబి బృందం స్పందించి ప్రాజెక్ట్‌లను స్థాపించేందుకు ముందుకు వచ్చే సంస్థలకు రుణాలు ఇస్తామని ప్రకటించింది. ఈ సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... విజయవాడ సిఎంఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన ఏడిబి ప్రతినిధులు