ఆంధ్రప్రదేశ్‌

తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి రూ.530 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఇంటెరిమ్ ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.530 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలనపరమైన ఆమోదాన్ని తెలిపింది. ఈ కాంప్లెక్స్‌లో మరో రెండు అంతస్తుల నిర్మాణానికి కూడా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టలని ఎపిసిఆర్‌డిఏ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఇంటెరిమ్ ప్రభుత్వ కాంప్లెక్స్‌లో అదనంగా రెండు అంతస్తులే కాకుండా, అంతర్గత పనులు, ఐదు భవనాలకు ఆర్కిటెక్చర్, శాసనసభ భవనానికి అనువైన డిజైన్‌ను రూపకల్పన చేసేందుకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో కూడిన మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసి డిపిఆర్ రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.