ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే ఉత్తరదేశ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఉత్తర భారతదేశంలో విహారయాత్రకు తీసుకువెళ్తున్నారని, ఢిల్లీ టూర్ పేరుతో ఎమ్మెల్యేలకు విహారయాత్ర ఎంత తిప్పినా తమ మనసులో ఉన్న అభిప్రాయాల మేరకే వారు నిర్ణయాలు తీసుకుంటారని గుర్తించాలని టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాదరావు అన్నారు. సోమవారం నాడు ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పాత్రికేయులతో మాట్లాడారు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో వైకాపాలో ప్రజాస్వామ్యం కూడా అంతే ఉందని అన్నారు. వైకాపా సేవ్ డెమొక్రసీ అంటూ ఆందోళనలు చేయడం అర్ధం లేనిదని అన్నారు. సేవ్ డెముక్రసీ పేరుతో హల్‌చల్ చేస్తున్న జగన్ అండ్ కో ఢిల్లీలో కూడా తమ పరవును తీసుకోవడానికే ఢిల్లీ వెళ్తున్నారని అన్నారు. వైకాపా నుండి 13 మంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చిన తర్వాత వారంతా తమ పార్టీలోనే ప్రజాస్వామ్యం లేదని చెబుతున్నారని అన్నారు. ఇపుడు జగన్ సేవ్ డెమొక్రసీ అంటూ యాగీ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. 21 మంది టచ్‌లో ఉన్నారని జగన్ చెప్పడం చూస్తుంటే తమ పార్టీలో కేవలం 21 మంది మాత్రమే మిగులుతారనే భావనతో చెప్పారని అనిపిస్తోందని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం గురించి ఆలోచించకుండా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచించకుండా కేవలం ఆరోపణలకే పరిమితం కావడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని అన్నారు. ముందు తనపై ఉన్న అవినీతి అభియోగాల గురించి ఆలోచించాలని, అనుభవజ్ఞుడైన పరిపాలకుడిగా ఉన్న చంద్రబాబుపై జగన్ వ్యక్తిగత ధూషంలకు దిగడం సమంజసం కాదని అన్నారు.చంద్రబాబును విమర్శించేంత ఆలోచన పరిణిత, స్థాయి, అనుభవం జగన్‌కు లేదని డొక్కా మాణిక్య వర ప్రసాదరావు పేర్కొన్నారు.