ఆంధ్రప్రదేశ్‌

అశ్వవాహనంపై రాములోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 22: మరో అయోధ్యగా పేరుగాంచి, ఏకశిలానగరంలా విరాజిల్లుతున్న కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజు శుక్రవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఉదయం కాళీయమర్దనాలంకారంలో రాములోరు భక్తులకు కనువిందు చేశారు. ముందుగా ఉత్సవమూర్తులకు అర్చకులు స్వపన తిరుమంజనం జరిపారు. సాయంత్రం సీతారాములకు అర్చకులు ఊంజల్ సేవ నిర్వహించారు. సీతారామలక్ష్ముణులు అశ్వవాహనంపై పురవీధుల్లో దర్శనమిచ్చారు. చివరిరోజు శనివారం సీతారామలక్ష్ముణులకు చక్రస్నానం జరుగుతుంది.