ఆంధ్రప్రదేశ్‌

బ్యాంకులకు రూ.2 కోట్లు టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 22: రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే దురాలోచనతో కొందరు పక్కా పథకంతో బ్యాంకులకు రూ.2.20కోట్ల మేర టోపీ పెట్టారు. తమ ప్రయత్నం విజయవంతం అయి రెండు జాతీయ బ్యాంకులు తమ బుట్టలో పడడంతో మరో రూ.200 కోట్లకు నొక్కేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈలోగా వారి బండారం కాస్త పోలీసుల చెవిన చేరడంతో కటకటాలు వెనక్కివెళ్లారు. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు పోలీసులు 10 మందిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితో సహా మరో 19 మంది పరారీలో ఉన్నారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం విశేషం. నగర డిఎస్పీ వెంకటరాముడు తన కార్యాలయంలో శుక్రవారం విలేఖరులకు వివరించారు. నగరంలోని ఉస్మాన్‌సాహెబ్‌పేటకు చెందిన అవధానం సత్యసాయి గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.అతని ప్రవర్తన బాగులేకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన తన అక్క కాశీభట్ల విజయలక్ష్మి, బావ జవహర్‌లాల్‌నెహ్రూ, మరో స్నేహితుడు బత్తల కల్యాణ్‌కుమార్ అలియాస్ బాబిరెడ్డితో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయిని పాముల సువర్చలలతో కలిసి కోటీశ్వరులు అయ్యేందుకు బ్యాంకులను మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక పద్ధతిగా పథక రచన చేసి నకిలీ పత్రాలు, నకిలీ స్టాంపులు సృష్టించి, వివాదాల్లో ఉన్న ఇళ్లను ఎంపికచేసుకొని వాటిపై ఎన్‌ఓసీ, నకిలీ పట్టాల వంటి పత్రాలను సిద్ధం చేసుకున్నారు. ఈ నకిలీ పత్రాలతో జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్‌లో తమ పేరు మీద సదరు స్థిరాస్తులను రిజిస్టరు చేయించుకున్నారు. కొందరు బ్యాంక్ అప్రూవర్స్, లీగర్ సలహాదారులతో పాటు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై రుణాలు పొందారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో స్థిరాస్తులు సృష్టించుకుని వాటిపై బ్యాంకుల ద్వారా 2.20కోట్ల రూపాయలు రుణం పొందారు. ఈ సొమ్ముతో వెంకటాచలం మండలంలోని మూతపడిన అంజనీ రబ్బర్ పరిశ్రమను కొనుగోలు చేసి, దానిపై కార్పొరేషన్ బ్యాంకులో కోటి రూపాయల రుణం పొందారు. ప్రకాశం జిల్లాలో మరో ఫ్యాక్టరీని అద్దెకు తీసుకొని నడపకుండానే పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణం పొందారు. నెల్లూరు జిల్లా ఉలవపాళ్ల గ్రామంలో భూమి కొని టైర్ల కర్మాగారానికి శంకుస్థాపన చేసి బ్యాంకుల నుండి రూ.200 కోట్ల రుణం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ ముఠా చేతిలో మోసపోతున్న బాధితుడు కందికట్టు సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా వ్యవహారాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వచ్చాయి.