ఆంధ్రప్రదేశ్‌

26 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 22: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవాపథకం (ఆరోగ్యశ్రీ) బిల్లులు చెల్లించకుంటే ఈనెల 26 నుంచి నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చినట్టు ఎపి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు వంశీకృష్ణ తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా వివిధ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.450 కోట్ల మేరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా నేటికీ ఒక్క పైసా కూడా చెల్లించలేదన్నారు. ఆసుపత్రుల నిర్వహణ కష్టతరంగా మారిందన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకంతోపాటు ఉద్యోగ, పింఛన్‌దారులకు అందజేసిన నగదు రహిత పథకం, వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం తదితర వాటికి సంబంధించి కోట్లాది రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే సుమారు రూ.40 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటికే వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ట్రస్ట్ సిఇఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈనెల 15 నాటికి బకాయిలను చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారని, అయితే ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ బకాయిలు అందని కారణంగా 26న విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. భవిష్యత్‌లో బిల్లులు పెండింగ్ లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు.