తెలంగాణ

ఎంపి కుమార్తెకే ఒబిసి సర్ట్ఫికెట్ ఇవ్వరా?: విహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: క్రీమీలేయర్ పేరుతో తన కుమార్తెకు ఒబిసి సర్ట్ఫికెట్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించటం చూస్తుంటే రాష్ట్రంలోని బిసిలకు ఏ స్థాయిలో అన్యాయం జరుగుతోందనేది స్పష్టమవుతోందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. హనుమంతరావు గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడి కుమార్తెకు ఒబిసి సర్ట్ఫికెట్ ఇవ్వకపోవటం ఏమిటి? అని ప్రశ్నించారు. తన కుమార్తెకు పదేళ్ల క్రితం పెళ్లయిందని, పెళ్లి చేసుకుని వెళ్లి పోయిన ఆమెకు తన మూలంగా ఒబిసి సర్ట్ఫికెట్ ఇవ్వకపోవటం ఏమిటని విహెచ్ ప్రశ్నించారు. తన కుమార్తెకే ఇన్ని సమస్యలు ఎదురైతే ఇక సామాన్య బిసిలకు ఒబిసి సర్ట్ఫికెట్ తీసుకునేందుకు ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయోనని హనుమంతరావు వాపోయారు.

తెలంగాణ పాలిసెట్‌కు 97.35 శాతం హాజరు
నెలాఖరుకు ఫలితాలు, వచ్చే నెల కౌనె్సలింగ్
హైదరాబాద్, ఏప్రిల్ 21: ప్రైవేటు యాజమాన్యాల హెచ్చరికలతో అందర్నీ ఆందోళకు గురిచేసిన పాలిసెట్ -2016 గురువారం నాడు తెలంగాణలో ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పాలిసెట్-2016 ప్రశాంతంగా ముగిసిందని సాంకేతిక విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ ఎం వి రెడ్డి పేర్కొన్నారు. మొత్తం 1,27,972 మంది అభ్యర్ధులకు హాల్‌టిక్కెట్లు జారీ చేయగా, 97.35 శాతం అంటే 1,24,584 మంది పరీక్షకు హాజరయ్యారని ఆయన వెల్లడించారు. గత ఏడాది 1,00,201 మంది దరఖాస్తు చేయగా, 94,780 మంది పరీక్ష రాశారని, గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అభ్యర్ధులు పెరిగారని వివరించారు. వీరి కోసం 288 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ నెలాఖరుకు ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. మే మూడో వారంలో అడ్మిషన్ల కౌనె్సలింగ్ ప్రారంభిస్తామని జూన్ రెండో వారంలో తరగతులు మొదలవుతాయని చెప్పారు.

స్పీకర్ భద్రతాధికారి
రాసలీలలు
ఇంట్లో ఉండగా దాడి చేసిన కుటుంబ సభ్యులు
బట్టలు లేకుండానే వీధిలోకి పరుగులు తీసిన అధికారి
భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు

వరంగల్, ఏప్రిల్ 21: శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి భద్రతాధికారిగా విధులు నిర్వహిస్తున్న అధికారి వివిఐపి రక్షణను గాలికి వదిలి ఓ మహిళతో రాసలీలలో మునిగిపోయాడు. ఈ సంఘటన సాక్షాత్తు స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిథ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలోనే జరిగింది. స్పీకర్ క్యాంప్ ఆఫీస్ సమీపంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. రాసలీలల వ్యవహారం స్వయంగా కుటుంబ సభ్యులు, స్థానికులు పట్టుకొని దాడి చేయడంతో సంచలనం రేపింది. స్పీకర్ సిరికొండ మధసూదనాచారికి భద్రతాధికారి విధులు నిర్వహిస్తున్న అధికారికి సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి భార్యతో పరిచయం ఏర్పడింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో భూపాలపల్లి రాజీవ్‌నగర్‌లో ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే, వారిద్దరిపై కుటుంబసభ్యులు, కాలనీవాసులు గత కొంతకాలంగా నిఘా పెట్టారు. భద్రతాధికారి ఎప్పటిలాగే ఇంట్లోకి వెళ్లిన అనంతరం కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు దాడి చేశారు. దీంతో సదరు అధికారి బట్టలు లేకుండానే వీధుల్లోకి పరుగులు తీస్తూ అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులకు తారసపడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో తాను స్పీకర్ పర్సనల్ సెక్యూరిటీ అధికారినని చెప్పడంతో వారు అధికారికి దుస్తులు సమకూర్చినట్లు సమాచారం. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి స్పీకర్ ఆదేశాల మేరకు ఆయనను వదిలేసినట్లు ప్రచారం జరిగింది. ఈ సంఘటన నేపథ్యంలో సింగరేణి ఉద్యోగి జిల్లాల శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తన భార్యతో గత కొంతకాలంగా స్పీకర్ మధుసుధనాచారి పిఎస్‌ఓ వెంకటేశ్వర్లు అక్రమసంబంధం పెట్టుకున్నాడని భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి స్పీకర్ పిఎస్‌ఓ వెంకటేశ్వర్లుపై సెక్షన్ 448, 497 కింద కేసు నమోదు చేసినట్లు భూపాలపల్లి సిఐ రఘునందన్ తెలిపారు. స్పీకర్ పిఎస్‌ఓ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన వాడు కావడంతో వారి పైఅధికారులకు సమాచారం ఇచ్చామని, నేడో, రేపో వెంకటేశ్వర్లును అరెస్టు చేస్తామని సిఐ రఘునందన్ తెలిపారు.