ఆంధ్రప్రదేశ్‌

మహారాష్టల్రో పౌష్టికాహార కేంద్రాలను పరిశీలించిన స్పీకర్ కోడెల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు నేతృత్వంలో ప్రతినిధి బృందం మహారాష్టల్రో పర్యటిస్తోంది. రెండో రోజు కార్యక్రమాలను గురువారం నాడు ముగించినట్టు స్పీకర్ కోడెల చెప్పారు. మహారాష్టల్రో మూడు రోజుల పాటు పర్యటించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ బృందంలో మొత్తం 11 మంది సభ్యులున్నారు. వీరంతా బుధవారం నాడు ముంబై చేరుకున్నారు. మహారాష్టల్రో విజయవంతంగా పనిచేస్తున్న పౌష్టికాహార కేంద్రాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ముందుగా ఈ బృందం మదర్ చైల్డ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ మిషన్ డిజి వందన కృష్ణను కలిసింది. యునిసెఫ్ నేతృత్వంలో పర్యటిస్తున్న ఈ బృందం ఔరంగాబాద్ జిల్లాపరిషత్ సిఇఓ డాక్టర్ అభిజిత్ చౌదరితో సమావేశం అయింది. విజయవంతగా పనిచేస్తున్న ఆ కేంద్రాలపై అధ్యయనం జరిపిన సభ్యులు గురువారం నాడు అక్కడి ఐఎస్‌ఓ అంగర్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. అబ్దిమండి, పటోడా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు అక్కడి వినూత్న కార్యక్రమాలను పరిశీలించారు. గురువారం నాటి పర్యటనలో మంత్రి పీతల సుజాత కూడా పాల్గొన్నారు. ఐఎస్‌ఓ సర్ట్ఫికేట్‌తో నడుస్తున్న అంగన్‌వాడీ కంద్రాల పనితీరుతో సంతృప్తి చెందిన సభాపతి వ్యక్తిగతంగా 10వేల రూపాయిలు వారికి అందించారు. పర్యటనలో డాక్టర్ కోడెలతో పాటు ఎమ్మెల్యేలు కాగిత వెంకటరావు, సౌమ్య, గీత, సత్యప్రభ, సాంబశివరావు, జోగులు, సత్యనారాయణ, ఎమ్మెల్సీలు శ్రీనివాసులు, గేయానంద్, యునిసెఫ్ ప్రతినిధులు ప్రసూన్ సేన్, లక్ష్మీ భవాని, సచివాలయ అధికారి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.