ఆంధ్రప్రదేశ్‌

బీహార్‌లో రోడ్డు ప్రమాదం - ఆరుగురు ప.గో. యాత్రికుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు/నిడదవోలు, ఏప్రిల్ 17: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు యాత్రికులు బీహార్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతుల్లో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు ఉన్నారు. నిడదవోలుకు చెందిన అత్తిలి శ్రీరామ్ (70), భార్య సరస్వతి (60), సోదరి రుక్మిణి (75), కొవ్వూరు మండలం పంగిడి గ్రామానికి చెందిన మాచవరపు సత్యనారాయణ (59), భార్య లక్ష్మీకళావతి, కుమారుడు పవన్‌కుమార్ (23), తల్లి పద్మావతి (80) ఈ నెల 9న తీర్థయాత్రలకు రైలులో వెళ్లారు. కాశీ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న అనంతరం వీరంతా బీహార్‌లోని గయకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు బీహార్‌లోని కౌమార్ జిల్లా కౌండి గ్రామం వద్ద ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో శ్రీరామ్, ఆయన భార్య సరస్వతి, సోదరి రుక్మిణి, సత్యనారాయణ, ఆయన కుమారుడు పవన్‌కుమార్, తల్లి పద్మావతి మృతిచెందారు. సత్యనారాయణ భార్య లక్ష్మీకళావతి తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీరామ్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. తొమ్మిదిసార్లు కాశీ వెళ్లాలనేది ఆయన కోరిక. ఇప్పటికి ఐదుసార్లు వెళ్లివచ్చిన ఆయన ఆరోసారి మృత్యువాతపడ్డారు. శ్రీరామ్ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. కుమార్తెకు వివాహమయ్యింది. కుమారుడు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న శ్రీరామ్ సోదరుడు పాండురంగారావు బీహార్ వెళ్లారు. ఇదే ప్రమాదంలో మృతిచెందిన సత్యనారాయణ చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సత్యనారాయణ మృతికి రాష్ట్ర స్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్, ఐ పంగిడి గ్రామ సర్పంచ్ పొట్రు సుజాత, మాజీ ఎంపిపి పికె రంగారావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

chitram...

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శ్రీరామ్, సరస్వతి దంపతులు, సత్యనారాయణ - ప్రమాదంలో ధ్వంసమైన కారు