ఆంధ్రప్రదేశ్‌

వాస్తు కుదిరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: కొత్త అసెంబ్లీ నిర్మాణానికి వాస్తు సవరణ జరిగింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా వెలగపూడిలో ఐదు బ్లాకుల్లో సెక్రటేరియట్ శరవేగంగా తయారవుతోంది. ఆరోబ్లాక్‌లో అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ముందు ఉత్తర ముఖంగా అసెంబ్లీ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఆ విధంగా నిర్మించడం వలన ప్రభుత్వానికి మంచిది కాదని వాస్తు నిపుణులు చెప్పడంతో ఆ ప్లాన్‌లో మార్పులు చేసి తూర్పు ముఖంగా అసెంబ్లీని నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు సిఆర్‌డిఎకు ప్లాన్ అందింది. ఈ అసెంబ్లీ నిర్మాణ పనులను ఎల్ అండ్ టి చేపట్టనుంది. ఈ పనులు రేపు లేదా ఎల్లుండి నుంచి ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఉత్తర దిక్కుల లాండ్ స్కేప్ ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే ఆవైపుగా కూడా అసెంబ్లీకి వెళ్లడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలియచేశారు.
ఆగస్టు నాటికి అసాధ్యం
సెక్రటేరియట్‌తో పాటు, అసెంబ్లీ భవన నిర్మాణానికి కావల్సిన ప్లాన్ వచ్చేసి ఉంటే, ఆగస్టు నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయచ్చని భావించారు. ఈ పనులు సుమారు రెండు నెలలు ఆలస్యంగా ఆరంభమవడంతో ఆగస్టు నాటికి భవన నిర్మాణ పనులు పూర్తి చేయలేమని అధికారులు చెపుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టుకు కేవలం స్కెల్టెన్ మాత్రమే తయారవుతుంది. ఇంటీరియర్ పనులు చేయడానికి కనీసం రెండు, మూడు నెలల వ్యవధి కావల్సి ఉంటుంది. అక్టోబర్ వరకూ అసెంబ్లీ భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవచ్చని తెలుస్తోంది.
శరవేగంగా పనులు
ఇదిలా ఉండగా తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షాపూర్జీ అండ్ పల్లోంజీ రెండు బ్లాక్‌లను, ఎల్ అండ్ టి మూడు బ్లాక్‌లను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ రెండు సంస్థలు నిర్మాణ రంగంలో తమకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని శ్లాబ్ దశకు తీసుకువచ్చారు. శ్లాబ్‌లు పూర్తయిన వెంటనే మిగిలిన పనులు ఇంకా వేగంగా చేయగలుతామని కాంట్రాక్టర్లు చెపుతున్నారు.