ఆంధ్రప్రదేశ్
ఒడిశాలో మావోల డంప్ స్వాధీనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సీలేరు, ఏప్రిల్ 11: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని కళాపొదర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను 104 బిఎస్ఎఫ్ బెటాలియన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఈ డంప్‌లో భారీ ఆయుధ సామగ్రి లభించింది. మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో కళాపొదర్ అటవీప్రాంతానికి బిఎస్ఎఫ్ బలగాలు కూబింగ్ చేస్తూ ఆదివారం సాయంత్రం వెళ్ళారు. తనిఖీల్లో భాగంగా మావోయిస్టుల డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసున్నారు. ఈ డంప్‌లో నాలుగు ఎస్విఎంఎల్ తుపాకులు, 4 కంట్రీమేడ్ ఫిస్టల్స్, ఒక మదర్లోడ్ తుపాకి, ఒక ఎస్ఎల్ఆర్ తుపాకి, మ్యాగజైన్, 14 ఎస్ఎల్ఆర్ఆర్ఎం రౌండ్లు ఉన్నాయి.
అటవీ ప్రాంతంలో మరిన్ని డంప్‌లు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బిఎస్ఎఫ్ బలగాలు ఎఓబి సరిహద్దు అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.