ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు పనులకు మంత్రి తుమ్మల భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 7: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఖమ్మం జిల్లా భద్రాచలం మన్యంలోని మావోయిస్టుల కంచుకోటలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్ర్తిశిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యిటించారు. ఖమ్మం జిల్లా వాజేడు నుంచి భద్రాచలం వరకు సుడిగాలి పర్యటన చేశారు. రూ.100కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆర్ కొత్తగూడెం-కుర్నపల్లి, సీతానగరం-పులిగుండాల, చర్ల-పూసుగుప్ప ఛత్తీస్‌గఢ్ సరిహద్దులకు రహదారులకు భూమి పూజ చేశారు. వాటర్‌గ్రిడ్, మావోయిస్టులు పేల్చిన వెంకటాపురం ఎంపీడీఓ కార్యాలయానికి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, వాటర్‌గ్రిడ్‌లకు సబ్‌స్టేషన్లు, పాఠశాలలకు, కళాశాలలకు అదనపు గదులు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఏటూరునాగారం, పూసూరు వంతెన నిర్మించిన ఇంజనీర్లకు, ఐటీడీఏ పీఓకు మంత్రి తుమ్మల జ్ఞాపికలు అందించి సన్మానించారు. వెంకటాపురం మండలంలోని బర్లగూడెం-చిరతపల్లి మధ్య అటవీప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పర్యటించారు. ఇటీవలే రాజమండ్రి, భద్రాచలం జల రవాణాకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు.

విద్యుత్ వౌలిక సదుపాయాల కల్పన
విజయవాడ, ఏప్రిల్ 7: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో అత్యాధునిక విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ వంటి వౌళిక సదుపాయాల కల్పనకై ఆరువేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామంటూ కేంద్ర గ్రామీణ విద్యుత్ సంస్థ చైర్మన్ మరియు ఎనర్జీ ఎఫిషియన్స్ సర్వీస్ లిమిటెడ్ చైర్మన్ రాజీవ్‌శర్మ ప్రకటించారు. గురువారం నాడిక్కడ విద్యుత్ సమర్ధ వినియోగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న రాజీవ్‌శర్మ ప్రకటించారు. వేదికపైనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెంటనే స్పందిస్తూ రాజీవ్‌శర్మను అభినందించారు.