ఆంధ్రప్రదేశ్‌

మావోల చేతిలో ఇన్‌ఫార్మర్ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంచంగిపుట్టు, ఏప్రిల్ 7: పోలీసుల ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు బుధవారం రాత్రి కాల్చి చంపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జైరాం పాంగి తన స్వగ్రామమైన సింగోయి నుండి ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో కలిసి వెళ్తుండగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు జోలాపుట్టు ఆర్‌ఎఫ్ వద్ద రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన నలుగురు సాయుధ మావోయిస్టులు అడ్డుకున్నారు. వెనుకకూర్చున్న వ్యక్తిని వెళ్లిపోమని చెప్పి జైరాం పాంగిని తుపాకితో కాల్చి చంపారు. అనంతరం అక్కడ ఓ లేఖ విడిచివెళ్లారు. జైరాం పాంగి తమ విషయాలను పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడని, ఇలాగే మరో 16 మంది పోలీసులకు సహకరిస్తున్నారని, వారికి సైతం ఇదే గతి పడుతుందని మావోయిస్టులు విడిచిపెట్టిన లేఖలో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న మాచ్‌ఖండ్ పోలీసులు గురువారం సంఘటనాస్థలానికి చేరుకున్నారు. నందాపూర్ ఆరోగ్య కేంద్రంలో శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనతో సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది.