ఆంధ్రప్రదేశ్‌

రెండు రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 7 : అనంతపురం, కడప జిల్లాలో గురువారం తెల్లవారుజామున రెండు రైళ్లలో దొంగలు దోపిడీలకు పాల్పడ్డారు. అనంతపురం రూరల్ పరిధిలోని తాటిచెర్ల వద్ద బెంగళూరు-షోలాపూర్ ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సిగ్నల్ వైరు కట్ చేసి దోపిడీకి తెగబడ్డారు. కడప జిల్లాలోని పుల్లంపేట మండలం ఓబుళవారిపల్లెలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి పాల్పడ్డారు. కాచిగూడ-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్‌లో 45 గ్రాముల బంగారు ఆభరణాలు దోపిడీ చేసినట్టు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. గత సోమవారం ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు పడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా చిన్న చిన్న రైల్వే స్టేషన్‌లను లక్ష్యంగా చేసుకున్న దోపిడీ దొంగలు అక్కడ హఠాత్తుగా రైళ్లలోకి ప్రవేశించి దోపిడీలు చేసి పరారవుతున్నారు. అనంతపురం జిల్లాలోని గార్లదినె్న వద్ద సిగ్నలింగ్ వైర్లను కట్ చేసి మార్చి 27వ తేదీ జైపూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌లోదోపిడీకి తెగ బడ్డారు. దీంతోపాటు అంతకుమునుపు వారం రోజుల ముందు పెండేకల్లు వద్ద చెన్నై- ముంబయి ఎక్స్‌ప్రెస్‌లో ఇదే తరహాలో దోపిడీకి పాల్పడ్డారు. ఇక ఆయా రైళ్లల్లో భద్రతపై రైల్వే పోలీసులు కానీ, జిఆర్‌పి పోలీసులు కానీ పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని రైలు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.