ఆంధ్రప్రదేశ్‌

ట్రిబ్యునల్ ఎదుట ఏపి వాదనలు వినిపిస్తాం:దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 7: కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను గట్టిగా వినిపించనుందని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలియచేశారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం విలేఖరులతో మాట్లడుతూ రాష్ట్రానికి రావల్సిన కృష్ణా జలాలు రాకుండాపోతున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన కృషి ఫలితంగానే రాయలసీమకు పుష్కలంగా నీరు అందుతోందని ఆయన చెప్పారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందించామని అన్నారు. రబీలో రెండు లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో రాజశేఖరరెడ్డి అనుసరించిన వైఖరి కారణంగా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉమ అన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరుపున నియమించిన అడ్వకేట్ జనరల్ సక్రమంగా వాదించలేకపోయారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు రాజశేఖరరెడ్డిని హెచ్చరించినా, ఆయన పట్టించుకోలేదని అన్నారు. కృష్ణా పుష్కరాలు సందర్భంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికై రూ. 230 కోట్లు ఖర్చు చేసేందుకు జివో 245 ద్వారా పరిపాలనామోదం తెలిపినట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
9 నుంచి సిఎం జిల్లాల పర్యటనలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల తొమ్మిదో తేదీ నుంచి రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పర్యటించనున్నారు. చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, విశాఖ, నెల్లూరు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో పర్యటించనున్నారు. ఆయా పర్యటనల్లో భాగంగా ముఖ్యమంత్రి తొలుత ఆ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తారు. పంట సంజీవిని అమలు జరుగుతున్న తీరును పరిశీలిస్తారు. ఆ తరువాత ఉపాధి హామీ కూలీలు, రైతులు, జన్మభూమి కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. భూగర్భ జలాల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను వివరిస్తారు.