ఆంధ్రప్రదేశ్‌

బిజెపితో సంకీర్ణ ధర్మం పాటిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 7: తెలుగుదేశం, బిజెపి క్యాడర్ పరస్పరం కత్తులు దూసుకుంటోందా? ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందా? మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలన్న సాహసోపేత నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? తెలంగాణలో టిడిపి నుంచి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లినప్పుడు ఆక్రోశం వ్యక్తం చేసిన చంద్రబాబు ఏపిలో వైకాపాను ఖాళీ చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వంటి అనేక అంశాలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు గురువారం ‘ఆంధ్రభూమి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
ప్రశ్న: తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలను కేసిఆర్ తన పార్టీలో చేర్చున్నప్పుడు ఆక్రోశం వ్యక్తం చేసిన చంద్రబాబు అదే విధానాన్ని ఆయన ఇక్కడ ఎందుకు ప్రారంభించారు?
జవాబు: తెలంగాణలో మా పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లిపోయారన్నది నేను చెప్పలేను. మన రాష్ట్రం విషయానికి వస్తే, వైకాపా ఎమ్మెల్యేలను రమ్మనమని సిఎం పిలవడం లేదు. జగన్ వైఖరికి విసిగిపోయి ఆ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారు.
ప్రశ్న: ఆపరేషన్ ఆకర్ష్ పట్ల మీ పార్టీ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాకే దిక్కులేదు! వాళ్ళొచ్చి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేమంటారు?
జవాబు: పార్టీలోకి ఎంత మంది వచ్చినా, ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందీ లేదు. వారికి చేతి నిండా పని ఉంది. వారి నియోజకవర్గాల్లో పుష్కలంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. వీటిలో పోటీ చేయడానికి గెలుపు గుర్రాలు కూడా కావాలి కదా! పార్టీలోకి ఎంత మంది వచ్చినా, ఉన్నవారికి, వచ్చిన వారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది.
ప్రశ్న: కొత్తగా పార్టీలోకి వచ్చే వారితో, ఆయా జిల్లాల్లోని టిడిపి సీనియర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు?
జవాబు: నిరసన సహజంగానే ఉంటుంది. అయితే చంద్రబాబు మాత్రం ఎవరి గౌరవం వారికి ఇస్తున్నారు. అనంతపురం జిల్లాలో దివాకరరెడ్డి, సునీత కలిసి పనిచేస్తున్నారు. దీనివలన పార్టీ అభివృద్ధి చెందుతోంది. పాత, కొత్త వారంతా పార్టీ క్యాడర్‌ను కలిసి పనిచేస్తే వచ్చే మరిన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రశ్న: చంద్రబాబు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు చూస్తున్నారు. లోకేష్ పార్టీలో అంతా తానై నడిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మీకు తగిన గౌరవం లభిస్తోందా?
జవాబు: చంద్రబాబు, లోకేష్, తను కలిసి పార్టీ బాధ్యతలు చూస్తున్నాం. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కచ్చితంగా అమలయ్యేందుకు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ వెళ్ళే బాధ్యతతో పాటు, అధ్యక్షునిగా తను చేయాల్సిన పనులన్నీ స్వేచ్ఛగానే చేస్తున్నాను. అధ్యక్షునిగా నా గౌరవనికి ఇబ్బంది లేదు.
ప్రశ్న: టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటించిన చంద్రబాబు పార్టీని మరింత విస్తరించడానికి ఆమధ్య దూకుడుగా వెళ్లారు. తెలంగాణలో పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో పడినప్పటి నుంచి, జాతీయ పార్టీపై ఆయనకు ఆసక్తి తగ్గినట్టుంది? నిజమేనా?
జవాబు: జాతీయ పార్టీగా టిడిపిని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
ప్రశ్న: టిడిపితో తెగతెంపులు చేసుకోవాలని బిజెపి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనిపై మీ వైఖరి ఏంటి?
జవాబు: గత ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేశాయి. ఇప్పటికీ ఆ పార్టీతో తాము సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నాం. విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు రావల్సినవన్నీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని అడగడంలో తప్పు లేదు. అడగకపోతేనే తప్పు. అలా అడుగుతున్నామని బిజెపి నాయకులు నొచ్చుకోవడం సరికాదు! అయినా, బంధం తెంచుకోవాలని టిడిపి, బిజెపి అగ్ర నాయకులు భావించడం లేదు. కింద స్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులుంటే సరిచేసుకుంటాం.
ప్రశ్న: ప్రభుత్వంపై ప్రజల్లో కొన్ని కోణాల్లో అసంతృప్తి ఉంది. రెండేళ్ల ప్రభుత్వంపై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలన్న సాహసోపేత నిర్ణయాన్ని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు?
జవాబు: ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమాత్రం లేదు. ఇటీవల సర్వేలో మా పనితీరు పట్ల 79 శాతం మంది పాజిటివ్‌గా స్పందించారు.
ప్రశ్న: మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు? మంత్రివర్గ విస్తరణలో వీరిని తొలగించే అవకాశం ఉందంటారా?
జవాబు: క్యాబినెట్‌ను ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా బాధ్యతలు అప్పగిస్తారు.