ఆంధ్రప్రదేశ్‌

ఠారెత్తిస్తున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 7: రాష్ట్రంలో వడగాడ్పులకు ఈ వేసవిలో ఇప్పటి వరకూ 45 మంది మరణించారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో 11 మంది మరణించారని ఆయన పేర్కొన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో 16 మంది, కర్నూలు జిల్లాలో ముగ్గురు మరణించారు.
సీమలో భగభగలు
అనంతపురం : రాయలసీమలోఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సీమవాసులు బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్ది రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే అనంతపురం జిల్లాలో ఎండలు గురువారం కొద్దిగా తగ్గినట్టు కనిపించాయి. అయితే కర్నూలు, కడప జిల్లాల్లో తగ్గుముఖం పట్టలేదు. అనంతపురంలో గురువారం జిల్లా సగటు ఉష్ణోగ్రత 40.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా జిల్లా కేంద్రమైన అనంతపురంలో 40.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లాలోని సుమారుగా 80 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ లలో 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదు బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. కర్నూలు జిల్లా సగటు ఉష్ణోగ్రత 42.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా జిల్లా కేంద్రమైన కర్నూలులో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లాలోని 118 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ లలో40 డిగ్రీల సెల్సియస్ పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కాగా శ్రీశైలంలో అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. కడప జిల్లా సగటు ఉష్ణోగ్రత 41.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కడపలో 43.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది.
వడదెబ్బకు వృద్దురాలి మృతి
పలాస,: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొద్ద్భద్ర గ్రామానికి చెందిన ఎం.కర్రమ్మ(50) గురువారం వడదెబ్బకు మృతి చెందింది. పొలంలో పని చేస్తుండగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.