ఆంధ్రప్రదేశ్‌

నిస్సహాయులకు ఆసరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 7 : నిస్సహాయులైన పేదలు, నిరుపేదలకు చేయూతను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పేదల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను అందించే మీ ఇంటికి-మీరేషన్ కార్యక్రమాన్ని కాటిగానికాల్వ గ్రామంలోగురువారం ఆమె ప్రారంభించారు. జిల్లా సంయుక్త కలెక్టరు సయ్యద్ ఖాజామొహిద్దీన్‌తో కలసి మంచానికే పరిమితమైన వృద్ధుడు చెన్నప్పకు రేషన్‌ను అందించి కార్యక్రమాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న పేదలకు లబ్ధి చేకూర్చే విధంగా కార్డులో ఒకే ఒక్క పేరు ఉండి మంచానికే పరిమితమైన వారికి, కుష్టు రోగులకు మీ ఇంటికి-మీ రేషన్ పథకం కింద ఇంటివద్దకే సరుకులు అందిస్తున్నామన్నారు. అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతారన్నారు.