ఆంధ్రప్రదేశ్‌

సింహాచలేశుని సన్నిధిలో అశోకగజపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఏప్రిల్ 7: భగవంతుడు అందించిన ఈ సృష్టిని గౌరవించాలని, ప్రతి ఒక్కరిలో భక్త్భివం పెంపొందింపజేయగలిగితే మానవ జన్మకు సార్థకత చేకూరుతుందని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవాలయ అనువంశిక ధర్మకర్త, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక గజపతిరాజు అన్నారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు. ఎప్పుడూ రాజకీయ, సామాజిక అంశాల గురించే మాట్లాడే అశోక గజపతిరాజు ఈసారి ఆధ్యాత్మిక ధోరణి కనబరిచారు. సింహాచలం దేవాలయంతో తరతరాలుగా తమ వంశీయులకు ఉన్న అనుబంధాన్ని అశోక్‌గజపతిరాజు వివరించారు. ఇప్పుడు ప్రత్యక్షంగా స్వామికి సేవచేసే భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పూర్వీకులు అందించిన జ్ఞానం నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఆధునిక జీవన విధానంతో అన్నీ మరచిపోతున్నామని అన్నారు.