ఆంధ్రప్రదేశ్‌

ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రూ. 710 కోట్ల నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 7: ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 710.54 కోట్లు నిధులు కేటాయించిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటి, తెలుగుభాష, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనార్టీ ముస్లింలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అభినందిస్తున్నారన్నారు. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములన్నింటిని ఉక్కుపాదం మోపి స్వాధీనం చేసుకోవటం జరుగుతుందని ఆయన తెలిపారు. స్వాధీనపరచుకున్న భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం మైనార్టీల అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఖాళీగా ఉన్న భూములను అభివృద్ధిపరటం జరుగుతుందని మంత్రి తెలిపారు. లీజులు పెంచి ఆదాయం పెంచుతామని మంత్రి వివరించారు. మసీదులు, దర్గాలను అభివృద్ధి చేయటం జరుగుతుందని మంత్రి వివరించారు. వక్ఫ్‌బోర్డు ఆదాయంతో ముస్లిం మైనార్టీలను సోషియో ఎకనామిక్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగించటం జరుగుతుందని మంత్రి వివరించారు. ప్రతి ఏటా చంద్రన్న రంజనా తోఫా పథకం ద్వారా రూ. 31కోట్ల విలువగల వస్తువులు 11 లక్షల ముస్లిం మైనార్టీలకు అందజేయటం జరుగుతుందన్నారు. మైనార్టీ ప్రజలు ముఖ్యమంత్రిని వేయింనోళ్లు పొగుడుతున్నారన్నారు. దర్గా ఇమామ్‌లు రూ.5వేలు, వౌజన్‌కు రూ.3వేలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. విద్యతో అభివృద్ధి సాధ్యపడుతుందని, విద్యకు ప్రాధాన్యతను ఇచ్చిన ముఖ్యమంత్రి ముస్లిం మైనార్టీలకు స్కాలర్‌షిప్‌కు నిధులు కేటాయించారన్నారు. వౌలానా ఆజాద్ విశ్వవిద్యాలయం కడపలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం కర్నూలులో నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో 36 కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయని, స్వయం ఉపాధి పొందటానికి అనువైన కోర్సుల్లో శిక్షణను ఈ కేంద్రాలు ద్వారా ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. మసీదులు, దర్గాల్లో ఖాళీల భర్తీకి ముస్లిం మైనార్టీలకే ప్రాధాన్యతనివ్వాలని మంత్రి సూచించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమ అభివృద్ధి అంశాలను ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్లు కూడా ప్రతి నెలా సమీక్షించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.