ఆంధ్రప్రదేశ్‌

రూ. 7.5 కోట్లతో ఐదు ప్రాంతీయ టూరిజం హబ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: నూతన పర్యాటక విధానాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ప్రాంతీయ టూరిజం హబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకుగాను ఒక్కో హబ్‌కు రూ.1.50 కోట్ల చొప్పున మొత్తం రూ.7.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో విశాఖపట్నం, కోనసీమను కలుపుతూ రాజమండ్రి- కాకినాడ, అమరావతి-విజయవాడ, తిరుపతి, కర్నూలు-అనంతపురం ప్రాంతాలను టూరిజం హబ్‌లుగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. వీటి అభివృద్ధికి ఖర్చు చేసే నిధులన్నీ టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఉన్న రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షణలో జరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యాటక ప్రాంతాల్లో బీచ్‌ల అభివృద్ధి, బౌద్ధ స్థలాల గుర్తింపు, వాటర్ స్పోర్ట్స్, కాలువలు, నదులు, బోట్ షికార్, సీ ప్లాన్, హిల్ టూరిజం వంటి వాటిని అభివృద్ధి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.