ఆంధ్రప్రదేశ్‌

బందరు, విజయనగరం కార్పొరేషనే్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: విజయనగరం, మచిలీపట్నం (బందరు) పట్టణాలను మున్సిపల్ కార్పొరేషన్లుగా గుర్తించినట్టు మున్సిపల్ మంత్రి డాక్టర్ పి నారాయణ మంగళవారం నాడు శాసనసభలో చెప్పారు.
అయితే ఇప్పటికే మున్సిపాల్టీ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ఉన్నారని, వారి పదవులు రద్దు కారాదనే సదుద్దేశంతో వారి పదవీకాలం ముగిసే వరకూ కార్పొరేషన్ హోదా జీవోను పక్కన పెట్టామని మంత్రి శాసనసభకు చెప్పారు. ఈ మేరకు మరో జీవోను అన్ని వివరాలతో ఇచ్చామని పేర్కొన్నారు.
రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, ఉప్పులేటి కల్పన, రాజన్నదొర , బూడి ముత్యాల నాయుడు, కొడాలి వెంకటేశ్వరరావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులు ఇచ్చారు. ప్రభుత్వం జీవో జారీ చేయగానే ప్రజాప్రతినిధులు తమ బోర్డులు మార్చేసుకున్నారని, జీవోలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసినట్టు పేర్కొందని గుర్తుచేశారు. ఇంతకీ ఆ రెండు మున్సిపాల్టీల్లో ఎన్నికలు పెడతారా లేదా ఉన్న కమిటీలను రద్దు చేస్తారా అని రంగారావు నిలదీశారు. 2015 డిసెంబర్ 9న ఇచ్చిన జీవోలను పక్కన పెడుతూ ఫిబ్రవరి 12న జీవో 35, 36లను జారీ చేశామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు, కర్నూలు, తిరుపతి, కాకినాడ తదితర కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని అక్కడ ఆ ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.