ఆంధ్రప్రదేశ్‌

ఇదేనా దళితుల ఉద్ధరణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29 : అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా దేశం వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరిగేందుకు ఏర్పాట్లు జరగడం పట్ల శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్లాఘించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎపి శాసనసభలో మంగళవారం జరిగిన చర్చలో పాల్గొంటూ చంద్రబాబు ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నట్టు గొప్పలు చెబుతోందని, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు. 2015-16 సంవత్సరంలో ఎస్‌సిల జనాభా దామాషా ప్రకారం ప్రణాళికా నిధుల్లో 6574 కోట్లరూపాయలు వీరి సంక్షేమానికి ఖర్చు చేయాల్సి ఉండగా, 4054 కోట్ల రూపాయలే ఖర్చు చేశారన్నారు. అలాగే ఎస్‌టిలకోసం 3867 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా, 2000 కోట్ల రూపాయలే ఖర్చు చేశారని గుర్తు చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎక్కువగా లబ్దిపొందేది ఎస్‌సి, ఎస్‌టి వర్గాలేనని అన్నారు. ఈ నిధుల్లో నూటికి నూరు శాతం కూలీ కోసమే ఖర్చు చేయాల్సి ఉండగా, 40 శాతం నిధులను మెటీరియల్ పేరుతో వ్యయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పథకం కింద 1.76 కోట్ల మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా 58 లక్షల మందికే ఉపాధి కల్పించారని పేర్కొన్నారు.