ఆంధ్రప్రదేశ్‌

సర్కార్ సాయం ‘కరవు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29 : ఆంధ్రప్రదేశ్‌లో కరవు సాయం అందించడంలోనూ కేంద్రం నుండి రాబట్టడంలోనూ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ వైకాపా సభ్యులు మంగళవారం నాడు శాసనసభ నుండి వాకౌట్ చేశారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో దుర్భిక్ష పీడిత మండలాలకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశంపై గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వై విశే్వశ్వరరెడ్డి, అత్తర్ చాంద్ బాషా తదితరులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సమాధానం చెబుతూ ప్రభుత్వం కరవు తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తోందని జగన్ పేర్కొన్నారు. తాగునీటి కోసం కిలోమీటర్లు కొద్దీ దూరం మహిళలు వెళ్తున్నారని రాష్ట్రప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించడంలో జాప్యం చేసిందని దానివల్ల కేంద్రం నుండి సకాలంలో రావల్సిన మొత్తం సహాయం అందలేదని ఆరోపించారు. అక్టోబర్ 27న 196 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించిందని, నవంబర్ 21న మరో 163 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించిందని వరదల సమయంలో కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించిందని ఎద్దేవా చేశారు. చాలీచాలని కేటాయింపులు వల్ల రాష్ట్రానికి తానునీటి సమస్య కూడా వచ్చిపడిందని రైతాంగం నానా అగచాట్లు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా దుర్భిక్ష నివారణకు రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలను హోం మంత్రి సభకు వివరించారు. రాష్టస్థ్రాయిలో అనునిత్యం నీటి కొరత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని, తాగునీటి రవాణా, ప్రైవేటు బోర్ బావులను అద్దెకు తీసుకోవడం, పైప్‌లైన్లు, బోరు బావులు, పంప్‌సెట్లను మరమ్మతులు చేయడం ద్వారా తాగునీటి ఎద్దడిని తగ్గించడానికి తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 425 జనావాసాలకు నీటిని రవాణా చేస్తున్నామని గ్రామీణ ప్రాంతాల్లోని 42 జనావాసాల్లో 46 ప్రైవేటు బోరు బావులను అద్దెకు తీసుకున్నామని చెప్పారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవనం, పశుసంవర్ధక శాఖ, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌లలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలను చినరాజప్ప తెలిపారు.