ఆంధ్రప్రదేశ్‌

హోదాపై వెంకయ్య వ్యాఖ్యలు ఆక్షేపణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 8: రాష్ట్రప్రజల హక్కుగా భావిస్తోన్న ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయమని, ప్రజలను అవమానించేవిగా ఉన్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరులోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అంబటి మాట్లాడుతూ ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని వెంకయ్య మాట్లాడటం సరైంది కాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో కృష్ణావతారమెత్తి అన్ని తానై వ్యవహరించానన్న భావన కల్పించిన వెంకయ్య నేడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆయన నిజస్వరూపానికి నిదర్శనమన్నారు.
94 మంది మావోయిస్టు
సానుభూతిపరుల లొంగుబాటు
భద్రాచలం, నవంబర్ 8: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ ఎదుట మంగళవారం 94 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. వీరంతా కలిమెల పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజల్‌కొండ, సుద్ధకొండ గ్రామాలకు చెందిన వారు. మావోయిస్టులకు సానుభూతిపరులుగా ఉంటున్న వీరంతా తాము జనజీవన స్రవంతిలో కలుస్తామని, ఇకపై మావోయిస్టులకు సహకరించమని ప్రకటించారు.