ఆంధ్రప్రదేశ్‌

రేపు అనంతలో పవన్ భారీ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 8: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ గురువారం అనంతపురంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ విజయవంతానికి నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఈ సభ నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు మంగళవారం సభాస్థలిని స్థానిక పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నిర్వాహకులు టిసి వరుణ్, భవానీ రవికుమార్, హర్ష, డిస్కోబాబు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున సభా ప్రాంగణం ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. అలాగే పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు, పవన్ కల్యాణ్ అభిమాన సంఘం రాష్ట్ర నాయకులు పలువురు ముందస్తుగా మంగళవారం నగరానికి చేరుకున్నారు. సభా నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లపై సూచనలు, సలహాలు ఇచ్చారు.
భూసేకరణను వ్యతిరేకించిన రైతులు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, నవంబర్ 8: రాజధాని పరిధిలోని పలు గ్రామాల రైతులు భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, రోడ్లకు సంబంధించి ఇటీవల శంకుస్థాపన చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. సామాజిక సర్వే కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అనంతవరం గ్రామంలో సోషల్ ఇంపాక్ట్ ఎన్విరాన్‌మెంట్ సర్వేకు సీఆర్డీయే తుళ్లూరు డెప్యూటీ కలెక్టర్ మురళీకృష్ణ, కాంపిటెంట్ అథారిటీ వరభూషణరావు గ్రామసభ నిర్వహించారు.
సర్పంచ్ మేకా రాజేష్‌బాబుతో పాటు సుమారు వంద మంది రైతులు హాజరయ్యారు. రాజధాని ప్రకటన నాటి నుంచి అపరిష్కృతంగా ఉన్న గ్రామ కంఠాల సమస్యలను ఇంకా తేల్చకపోవటం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు. సీఆర్డియే రాజధాని భూములు.. రైతుల ప్లాట్ల విషయంలో ఏ మాత్రం అలక్ష్యం వహించ కుండా రైతాంగానికి మేలుచేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు.