తెలంగాణ

కృష్ణా పుష్కరాలకు రూ.1000 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాపుష్కరాల నిర్వహణకు దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి శాసనసభ్యుడు బోడే ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది నిర్వహించే కృష్ణా పుష్కరాలకు సంబంధించి యాత్రికులకు సౌకర్యాలను సమకూర్చేందుకు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని రెండు గట్లపై వివిధ ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను తయారు చేసే పనిలో అధికారులు ఉన్నారని వివరించారు.
బోధనా ఆసుపత్రిగా ‘డిఎస్‌ఆర్’
నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ డిఎస్‌ఆర్ జిల్లా ఆసుపత్రిని బోధనా ఆసుపత్రిగా మార్పు చేసి 2013 మార్చిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆరోగ్య, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే కె.శ్రీధర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, 2014 ఆగస్టులో ఎంసిఐ అనుమతి ఇచ్చిందని, 2015 అక్టోబర్ నుంచి వివిధ అభివృద్ధి పనులు, భవనాల నిర్మాణం, వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కోర్టు అనుమతి తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్ధలాల కేటాయింపు జరుగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి కె.ఇ కృష్ణమూర్తి చెప్పారు.
సిజెఎఫ్‌ఎస్‌లో భూ ఆక్రమణ!
గూడూరు నియోజకవర్గంలోని సిజెఎఫ్‌ఎస్ భూముల్లో ఆక్రమణ జరిగినట్లు ఇటీవల ఒక ఫిర్యాదు అందిందని రెవెన్యూ శాఖ మంత్రి కె.ఇ కృష్ణమూర్తి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ నుంచి విచారణ నివేదిక రావాల్సి ఉందని అన్నారు. ఇంతవరకు ఆక్రమణలకు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. కాగా, సింహాచల ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలను క్రమబద్దీకరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.
ఎకరానికి రూపాయి కౌలు..
విశాఖ జిల్లా అచ్యుతాపురం, రాంబెల్లి మండలాల్లో మెసర్స్ బ్రాండిక్స్ ఇండియా అప్పారెల్ సిటీకి 25 సంవత్సరాల పాటు కౌలు ప్రాతిపదికపై ఎకరాకు రూపాయి చొప్పున వెయ్యి ఎకరాలను ఎపిఐఐసి కేటాయించడం నిజమేనని ముఖ్యమంత్రి తరఫున కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
పప్పు ధాన్యాలపై 5 శాతం వ్యాట్
రాష్ట్రంలో వ్యాట్ చట్టాన్ని అనుసరించి పప్పు ధాన్యాలపై 5 శాతం చొప్పున పన్ను విధించినట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈ పన్నును రద్దు చేయడానికి ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి వివరించారు.