ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో బి.టెక్ విద్యార్థులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 27: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రపంచ స్థాయిలోనే పేరుగాంచిన అండర్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనే జిల్లా యువతకు సంబంధాలు ఉన్నట్లు రాజంపేట డీఎస్పీ రాజేంద్ర నిర్ధారించినట్లు తెలుస్తోంది. గ్రూప్-1 అధికారిగా ఎంపికై రాజంపేట డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర 20 రోజులు కూడా కాకమునుపే ఎర్రచందనం స్మగ్లింగ్ మూలాలను పెకలించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో శనివారం రాత్రి రైల్వేకోడూరు సమీపంలో అంతర్రాష్ట్ర స్మగ్లర్లుగా పేరున్న 10 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 25 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్లలో ఆరుగురు బి.టెక్ విద్యార్థులుండగా వారంతా వివిధ జిల్లాలకు చెందిన యువతగా పోలీసులు గుర్తించారు. శేషాచలం అటవీ ప్రాంతాల నుంచి గత కొంతకాలంగా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు బి.టెక్ విద్యార్థులే పకడ్బందీగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్నట్లు సమాచారం. రైల్వేకోడూరుకు చెందిన సి.తేజవర్మ మూడేళ్ల క్రితం బి.టెక్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో మకాం వేసి పక్కా వ్యూహరచన చేసేవాడు. దాని ప్రకారం ఎర్రచందనాన్ని జిల్లా నుంచి ఎల్లలు దాటిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తేజవర్మ పలు రాష్ట్రాల్లో సెవెన్ స్టార్ హోటళ్లలో మకాం వేసి అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఎర్రచందనాన్ని దేశ విదేశాలకు అంతర్జాతీయ స్మగ్లర్ల ద్వారా తరలించి వందల కోట్ల రూపాయలకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. తేజవర్మను పకడ్బందీగా వ్యూహం పన్ని డీఎస్పీ రాజేంద్ర నేతృత్వంలో శనివారం అరెస్టు చేశారు. అతడితో పాటు రైల్వేకోడూరుకు చెందిన బి.టెక్ విద్యార్థులు ఎం.పెంచలయ్య, కార్తీక్, టి.గోపీ, పెంచలయ్య, ఎన్.చంద్రం, తిరుపతికి చెందిన జనార్ధన్‌వర్మ, లవకుమార్, దినేష్‌లను అరెస్టు చేశారు. వీరంతా హైదరాబాద్‌లో పకడ్బందీగా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అక్కడి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌కు ఏజెంట్లను నియమించుకుని ఎర్రచందనాన్ని ఎగుమతి చేసేవారు. వీరు ప్రతినిత్యం కోట్ల రూపాయల్లోనే వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. స్మగ్లర్ సి.తేజవర్మ కదలికలపై పోలీసులు ఏడాది నుంచి నిఘా పెట్టినప్పటికీ గుర్తించలేకపోయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వర్మ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు శనివారం ఎట్టకేలకు అరెస్టు చేశారు. అలాగే బిటెక్ విద్యార్థులను, సివిల్ వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఈ సంఘటనలో తవ్వేకొద్దీ నిజాలు వెలుగుచూస్తున్నాయి. అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన యువకులు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేందుకు అలవాటుపడ్డారు. వారందరూ శేషాచలం అటవీ ప్రాంతం సమీపంలోని యువకులే కావడంతో జిల్లా వాసులు నివ్వెరపోతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు 500 మంది పైబడి పోలీసులు, పోలీసు అధికారులు, టాస్క్ఫోర్స్ సిబ్బందిని నియమించినా సత్ఫలితాలను ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగ యువత తప్పుదారి పట్టకుండా ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.