ఆంధ్రప్రదేశ్‌

దూకుడు ఖాయమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 27: ఊహించినట్టుగానే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయా నియోజకవర్గాలలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఇరువురు నేతలూ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సమావేశాలు నిర్వహించారు. అధిక శాతం కార్యకర్తలు తెలుగుదేశంలోకి వెళితేనే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుండి తనకు ఆహ్వానం అందిందని ఆయన కార్యకర్తల సమక్షంలో ప్రకటించారు. జగ్గంపేట నియోజకవర్గంలోని జ్యోతుల నెహ్రూ స్వగ్రామం ఇర్రిపాకలోని తన నివాసంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నెహ్రూ పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతున్నారని వార్తలు రావడంతో వైసిపి నేత, జగన్ అనుయాయుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి హుటాహుటిన ఇర్రిపాక చేరుకున్నారు. నెహ్రూ ఇంట్లో ఆయన కొద్దిసేపు మంతనాలు జరిపారు. అయితే తాను కార్యకర్తలు చెప్పిన ప్రకారం నడుచుకుంటానని, వారి అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని నెహ్రూ స్పష్టం చేసినట్టు తెలిసింది. జగన్‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడాలని చెవిరెడ్డి కోరగా నెహ్రూ నిరాకరించారు. తాను నేరుగా జగన్‌ను కలసి పరిస్థితులు వివరిస్తానని చెప్పినట్టు సమాచారం. దీంతో పావుగంట సమయంలోనే చెవిరెడ్డి నిష్క్రమించినట్టు భోగట్టా. నెహ్రూతో పాటు ఆయన కుమారుడు, జడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల నవీన్‌కుమార్ తదితరులు జ్యోతుల వెంటే వెళ్ళనున్నారు. జ్యోతుల నెహ్రూ ఆదివారం హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్ళడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. ఇదిలావుండగా జ్యోతుల, వరుపులతో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కూడా దేశం తీర్థం పుచ్చుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. జ్యోతుల నెహ్రూకు బంధువైన అనంత ఉదయ్‌భాస్కర్ 2014 ఎన్నికల్లో వంతల రాజేశ్వరికి టిక్కెట్‌ను ప్రతిపాదించడంతో పాటు ఆమె విజయానికి కృషిచేశారు. అప్పటి నుండి అనంత ఉదయ్‌భాస్కర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ, జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో ఆమె పనిచేస్తున్నారు. ఈనేపథ్యంలో రాజేశ్వరి కూడా త్వరలోనే తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విషయంలో తెలుగుదేశం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. సుమారు నెల రోజుల క్రితం జగ్గిరెడ్డిని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలుగుదేశంలోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరిగింది. తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు కూడా అధికార తెలుగుదేశం నుండి ఆహ్వానం అందినట్టు సమాచారం. అయితే తుని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాను తెలుగుదేశంలో చేర్చుకోవాలంటే ఇదే నియోజకవర్గానికి చెందిన ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయాన్ని కూడా అధినేత చంద్రబాబు పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుందని సమాచారం.

చిత్రం ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు