ఆంధ్రప్రదేశ్‌

శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 14: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని, హింసకు, దుస్సంఘటనలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఏ స్థాయి నాయకుడైనా, సామాన్యులైనా నిర్భయంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని తీసుకున్న ప్రతి ఫిర్యాదుకు సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. శనివారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. రాష్టవ్య్రాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, కొన్ని చోట్ల అనుకోకుండా జరిగిన సంఘటనలు పోలీసు వ్యవస్థపై ఆరోపణలకు తావిచ్చాయన్నారు. మాచర్ల, పుంగనూరు, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. మాచర్లలో జరిగిన దాడి ఘటనపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించామని తెలిపారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయడం వలన పూర్తిస్థాయి వివరాలు అందుబాటులో లేకపోవడంతో నిందితులను వెంటనే అరెస్ట్ చేయలేకపోయామన్నారు. అయితే సంఘటన తీవ్రతను గమనించి నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపామని, అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చారన్న ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. విజయవాడకు చెందిన టీడీపీ నేతలు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచర్లకు వెళ్లారని, వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చినా, స్పందించలేదని ఆరోపణలు చేశారన్నారు. అయితే సంబంధిత నేతలు ఏ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు, పోలీసుల ప్రతిస్పందన, నేతల కాల్‌లిస్ట్‌పై సమగ్ర విచారణ నిర్వహిస్తున్నామని చెప్పారు. పుంగనూరుకు సంబంధించి మహిళను అడ్డుకున్న వారిలో బాధ్యులు ఒకే రాజకీయ పార్టీ, ఒకే కుటుంబానికి చెందిన వారని తమ సమగ్ర దర్యాప్తులో తేలిందన్నారు. ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వారం రోజులుగా రాష్టవ్య్రాప్తంగా వివిధ ప్రాంతాల్లో 57 సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 10,243 స్థానాలకు 54,594 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. ఇందుకు సంబంధించి రాష్టవ్య్రాప్తంగా ఆయా ప్రాంతాల్లో 43 అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. అలాగే మున్సిపల్, నగర పంచాయితీలకు సంబంధించి రాష్టవ్య్రాప్తంగా 15,185 నామినేషన్లు దాఖలు కాగా కేవలం 14 సంఘటనలు మాత్రమే చోటు చేసుకున్నాయని వివరించారు. కేవలం అతికొద్ది అవాంఛనీయ సంఘటనలను మొత్తం ఎన్నికల ప్రక్రియకు ఆపాదించి పోలీసు వ్యవస్థను తప్పుబట్టడం ఆరోపణలు చేసే వారికి సరికాదని డీజీపీ హితవుపలికారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాష్టవ్య్రాప్తంగా 59,549 మంది వివిధ విభాగాలకు చెందిన పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు ఏపీఎస్‌పీకి చెందిన 93 ప్లటూన్లను రంగంలోకి దించామన్నారు. అభ్యర్థులు, పార్టీ నేతలు, సామాన్యుల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును స్వీకరించి కూలంకషంగా విచారణ చేపట్టి సంబంధిత నివేదికలను ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తున్నామని అన్నారు. ఎలక్షన్ కమిషన్‌లో ఐజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించారని, సోమవారం నుండి ఆయా జిల్లాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులను పంపనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రధాన భూమిక పోషిస్తున్న తరుణంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వీటిని అరికట్టేందుకు ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిందని తెలిపారు. ఆర్డినెన్స్ మేరకు ఈనెల 11వ తేదీన ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో రాష్టవ్య్రాప్తంగా అక్రమ మద్యం రవాణా, తయారీపై ఆకస్మికదాడులు చేపట్టామని పేర్కొన్నారు. దీంతో రాష్టవ్య్రాప్తంగా 1605 కేసులు నమోదయ్యాయని, దాడుల్లో 4,752 కేజీల గంజాయి, 7,732 మద్యం సీసాలను సీజ్ చేశామని, 2 లక్షల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. జరగని సంఘటనలు జరిగినట్లు, లేని వారు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఇటువంటి దుష్ప్రచారం కారణంగా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని, ఈ దృష్ట్యా ఇటువంటి పరిణామాలపై కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు.
*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న డీజీపీ సవాంగ్