ఆంధ్రప్రదేశ్‌

వైకాపా ఖాతాలో కడప జిల్లా పరిషత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: ఎన్నికలకు ముందే కడప జిల్లా పరిషత్‌ను వైకాపా తన ఖాతాలో వేసుకుంది. జిల్లాలోని 50 జడ్పీటీసీ స్థానాల్లో 35 స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఎన్నిక ఇక లాంఛనమే. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, అధిష్టానం అండతో జిల్లా వ్యాప్తంగా తమ పార్టీకి పోటీ లేకుండా చేసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికలకు ముందే జిల్లా పరిషత్ ఛైర్మన్ గిరీని ఆ పార్టీ ఎగరేసుకుపోయింది. 50 జడ్పీటీసీ స్థానాల్లో 35 జడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఏకగ్రీవం చేసుకోగలిగింది. కేవలం 15 జడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే పోటీ ఉంది. ఈ పోటీ అయినా ఎన్నికల వరకు ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. జిల్లాలోని 50 మండలాల్లో 35 మండలాల మండలాధ్యక్షుల పదవులను వైసీపీ ఎన్నికలకు ముందే తమ ఖాతాలో వేసుకుంది. 15 మండలాల్లో మాత్రమే పోటీ జరుగుతోంది. ఏకగ్రీవం చేసుకోవడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామ, దాన, భేద , దండోపాయాలు ప్రయోగించింది. పోలీసు అధికారులు తమ పరిధిని దాటి అధికార పార్టీకి సహకరించారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని మండలాల్లో సీఐలు, ఎస్‌ఐలు తమ అధికార పరిధిని దాటి, పోటీలో ఉన్న అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరింపచేశారనే విమర్శలు సైతం ఉన్నాయి. నామినేషన్ల పరిశీలనలో రిటర్నింగ్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి ప్రతిపక్షపార్టీల నామినేషన్లను తిరస్కరించిన సంఘటనలే అధికం. ప్రతిపక్ష అభ్యర్థులు వేసిన నామినేషన్ పత్రాల్లో ఓటరు నెంబర్‌కు ముందో, వెనుకో మరో అంకె చేర్చి, జాబితాలోని ఓటరు నెంబర్‌తో సరిపోలేదనే కారణాలు చూపి తిరస్కరించిన సంఘటనలు కోకొల్లలు.
కాగా ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గస్థాయి నేతలు కూడా చేతులెత్తేయడం ఆ పార్టీ ఓటమికి మరో కారణం అని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ పక్షాన, అభ్యర్థులకు అండగా గట్టిగా నిలబడిన వారు లేరు. నియోజకవర్గ స్థాయి నేతలను కూడా అధికారపార్టీ వివిధ రూపాల్లో హెచ్చరించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం అధికారంలో ఉండగా ఆ నాయకులు చేసిన భూ కబ్జాలు తదితర వాటిని వెలికితీసి ప్రభుత్వపరం చేస్తామని, ఇన్‌కం టాక్స్ దాడులు జరుగుతాయని, వారు చేసిన కాంట్రాక్టు బిల్లులు ఇక ఎప్పటికీ రావనే హెచ్చరికలతో అనేక మంది మొహం చాటేశారు. పెద్ద నాయకులే మొహం చాటేయడంతో నామినేషన్ వేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఏదో ఒక వత్తిడికి లొంగిపోయారు.
ఎదురొడ్డిన ఆది
జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాత్రమే తన నియోజకవర్గంలోని మైలవరం, జమ్మలమడుగు, కొండాపురం, ముద్దనూరు మండలాల్లో జడ్పీటీసీ స్థానాలు, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను పోటీలో ఉంచగలిగారు. ఆ నియోజకవర్గంలో ఒక్క ఎర్రగుంట్ల మండలంలో మాత్రమే ఆయన పోటీ పడలేకపోయారు. ఈ మండలం వైసీపీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి సొంత మండలం కావడం గమనార్హం. ఇక పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో ఇటు జడ్పీటీసీ స్థానాలు , అటు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకుంది. ఇక్కడ పి.రవీంద్రనాధరెడ్డి, ఆర్.శివప్రసాదరెడ్డి, జి.శ్రీకాంత్‌రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి శాసన సభ్యులుగా ఉన్నారు. డివిజన్ల వారీగా కడప డివిజన్‌లో 17 జడ్పీటీసీ స్థానాలకు గాను 15 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జమ్మలమడుగు డివిజన్‌లో 16 జడ్పీటీసీ స్థానాలకు 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాజంపేట డివిజన్‌లో 17 స్థానాల్లో 8 మంది అధికారపార్టీ తరపున ఏకగ్రీవమయ్యారు. జిల్లాలోని 553 ఎంపీటీసీ స్థానాల్లో 428 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.