ఆంధ్రప్రదేశ్‌

వాయిదా వేయండి: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 14: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని, ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణ సరికాదని, వాయిదా వేసే అవకాశాలను పరిశీలించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం, ఇతర అంశాల్లో జన సమూహాలు ఒకే ప్రాంతంలో గుమిగూడే అవకాశం ఉందని, ఇది వ్యాధి వ్యాప్తికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ఏవిధంగా సమర్ధనీయమని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ కళ్లు తెరచి, వాస్తవాలు గుర్తించి ఎన్నికల కారణంగా కరోనా వైరస్ మరింత విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జనానికి కరోనా సోకిన తరువాత పరుగులు పెట్టి లాభం ఉండదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు మంజూరు కావని అంటున్నారని, పరిస్థితులు వివరించి కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలన్నారు.